Share News

నడిరోడ్డుపై మొరాయించిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - May 04 , 2024 | 01:46 AM

ఆర్టీసీ బస్సు నడిరోడ్డుపై మొరాయించి ఆగిపో వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నడిరోడ్డుపై మొరాయించిన ఆర్టీసీ బస్సు
Staff repairing the bus

అనంతపురం కల్చరల్‌, మే 3: ఆర్టీసీ బస్సు నడిరోడ్డుపై మొరాయించి ఆగిపో వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కల్యాణదుర్గం డిపోకు చెందిన ఏపీ02టీసీ6880 నెంబరు ఆర్టీసీ బస్సు శుక్రవారం మధ్యాహ్నం కళ్యాణదుర్గం నుంచి బయలుదేరి 3 గంటల సమయంలో అనంతపురం నగరంలోకి ప్రవేశించింది. అయితే బస్సు ఇంజినల్‌లో ఆయిల్‌ లీకేజీ కారణంగా బస్సు నగరానికి చేరుకునే సమయానికి ఆయిల్‌ మొత్తం కారిపోయి ఇంజిన ఆగిపోయింది. ఈ నేపథ్యంలో కల్యాణదుర్గం బైపాస్‌ సర్కిల్‌లో ఫ్లైఓవర్‌ కింద బస్సును ఆపేసి, మెకానిక్‌ను అక్కడికే పిలిపించుకుని తిరిగి బస్సు బస్టాండుకు తీసుకెళ్లారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - May 04 , 2024 | 01:46 AM