Share News

రూ.6.15 లక్షలు స్వాధీనం

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:00 AM

మండలంలోని మిడుతూరు గ్రామం వద్ద మంగళవారం అనంతపురానికి చెందిన వెంకటరాముడు నుంచి రూ.6.15లక్షల స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

రూ.6.15 లక్షలు స్వాధీనం

పెద్దవడుగూరు, ఏప్రిల్‌2: మండలంలోని మిడుతూరు గ్రామం వద్ద మంగళవారం అనంతపురానికి చెందిన వెంకటరాముడు నుంచి రూ.6.15లక్షల స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా వెంకటరాముడు కారులో తరలిస్తున్న నగదుకు ఆధారాలు చూపకపోవడంతో సీజ్‌చేసి సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కణేకల్లు రోడ్డు వద్ద రూ.2.70 లక్షలు ...

రాయదుర్గంరూరల్‌: పట్టణంలోని కణేకల్లు రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సోమవారం రాత్రి అనుమతి లేకుండా డబ్బుని తీసుకొని వెళుతున్న వ్యక్తి నుంచి రూ. 2.70 లక్షలు స్వాధీనం చేసు కున్నట్లు పోలీసులు తెలిపారు. అరబిక్‌ కాలేజ్‌ వద్ద ఎఫ్‌ఎస్‌టీటీబీఎస్‌ఎఫ్‌ జవాన్లు, పోలీసు సిబ్బంది వాహనా లను తనిఖీ చేస్తుండగా పట్టణానికి చెందిన దబ్బడి ఉమేష్‌ నుంచి నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కణేకల్లు నుంచి ద్విచక్రవాహనంలో అనుమతులు లేకుండా రూ. 2.70 లక్షలు తీసుకొని వస్తుండగా పట్టుబడినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 12:00 AM