Share News

కోడ్‌ వేళ జడ్పీలో బదిలీల గోల

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:36 PM

జిల్లా పరిషతలో ఎన్నికల కోడ్‌ వేళ అనూహ్యంగా అధికారులు, ఉద్యోగుల డెప్యుటేషన్లు, వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ పేరుతో బదిలీల వ్యవహారం నడుస్తోంది.

కోడ్‌ వేళ జడ్పీలో బదిలీల గోల

అనంతపురం విద్య, మార్చి 18: జిల్లా పరిషతలో ఎన్నికల కోడ్‌ వేళ అనూహ్యంగా అధికారులు, ఉద్యోగుల డెప్యుటేషన్లు, వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ పేరుతో బదిలీల వ్యవహారం నడుస్తోంది. ఉన్నఫలంగా జడ్పీ నుంచి కొందరిని బయటకు పంపడం, మరికొందరిని జడ్పీకి తేవడం, పైగా కోడ్‌ వచ్చిన వెంటనే వేగంగా ఉత్తర్వులు బయటకు వస్తుండటంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అయి తే ఈ బదిలీల వ్యవ హారం మొత్తం ఎన్నికల కోడ్‌ రావడానికి ముందే నడిచి నా....ఉత్తర్వుల కాపీలు మా త్రం కోడ్‌ కూసిన తర్వాత రావడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల కిందట డిప్యూటీ సీఈఓని బదిలీ చేసి...కొత్త అధికారిని నియమించారు. ఇటీవల పాలకవర్గం సభ్యులు ఆమెను సరెండ్‌ చేయాలని డిమాండ్‌ చేయడంతో... గుంతకల్లు డీఎల్‌డీఓగా డెప్యుటేషనపై కలెక్టర్‌ పంపారు. అదే అనూహ్యం అనుకుంటుంటే జడ్పీ పరిధిలోని మరో నలుగురు అధికారులను ఉన్నఫలంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పని సర్దుబాటు (వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌) కింద బదిలీ చేస్తూ.. జడ్పీ సీఈఓ ఈనెల 15న ఉత్తర్వులు జారీ చేశారు. జడ్పీలోని అడ్మిని సే్ట్రటివ్‌ ఆఫీసర్‌(ఏవో) షబిర్‌ నియాజ్‌ను శెట్టూరు ఎంపీడీఓ ఆఫీస్‌కు, పా మిడిలోని అడ్మిని సే్ట్రటివ్‌ ఆఫీ సర్‌ హరనాథ్‌ను జడ్పీ కార్యాలయానికి, జడ్పీలోని సీని యర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులును అమరాపురం ఎంపీడీఓ ఆఫీస్‌కు, పుట్టపర్తి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (పీఐయూ) ఆఫీస్‌లోని సీనియర్‌ అసిస్టెంట్‌ కేశవ్‌ను జడ్పీ కార్యాలయానికి వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ కింద బదిలీ చేశారు.

మరికొందరిపై వేటు తప్పదా..?

జడ్పీలో మరికొందరిపై వేటు వేయడం ఖాయం అన్నట్టు సమాచారం. గత కొంతకాలంగా జడ్పీ పాలకవర్గం వర్సెస్‌ జిల్లా బ్యూరో క్రసీ అన్నట్టుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇన్నాళ్లు పాలకవర్గంలోని కీలక నేతలు, జడ్పీ టీసీ సభ్యులు తమను జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు, సర్వసభ్య సమావేశాల్లో టార్గెట్‌ చేశారని ఇప్పుడు ఎన్నికల కోడ్‌ వచ్చిం దని...ఇక తామేంటో చూపిస్తాం అన్నట్టుగా జిల్లా బ్యూరోక్రసీ తమ యాక్షన ప్లాన అమలు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ పంతం నెగ్గించుకోవడంలో భాగంగా...జడ్పీ నుంచి కొందరు అధికారులను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం, మరికొందరికి జడ్పీకి తీసుకొచ్చినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇన్నాళ్లు ఉద్యోగుల పక్షాన, బ్యూరోక్రసీకి వ్యతిరేకంగా గళం విప్పిన ఇతర అధికారులపై వేటు వేసేందుకు యత్నాలు సాగుతున్నట్టు సమాచారం. బుసలు కొడుతున్న బ్యూరోక్రసీ త్వరలో జడ్పీలోని మరికొందరి పై కూడా బదిలీల వేటు వేయడం ఖాయం అంటూ జడ్పీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. మరి తర్వాత వచ్చే లిస్టులో ఎవరెవరు ఉంటారో అం టూ... కొందరు ఉద్యోగులు ఆందోళన చెందు తున్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:36 PM