Share News

Road accident:అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - May 26 , 2024 | 11:39 PM

మండలకేంద్రానికి చెందిన నరసింహులు (22) అన్నమయ్య జిల్లాలోని రాయచోటి స మీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు.

 Road accident:అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం

- తనకల్లు వాసి మృతి

తనకల్లు, మే 26: మండలకేంద్రానికి చెందిన నరసింహులు (22) అన్నమయ్య జిల్లాలోని రాయచోటి స మీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నరసింహులు అన్నమయ్య జిల్లా దేవరగూడిపల్లిలో వివాహం చేసుకున్నా డు.


అతడి భార్య పల్లవి ప్రస్తుతం గర్భిణి. ప్రసవం కోసం పుట్టినింటికి వెళ్లింది. కాగా నరసింహులు భార్యను చూడడం కోసం ఆదివారం అత్తగారి ఊరికి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. తొలుత రాయచోటికి వెళ్లి.. అక్కడినుంచి దేవరగూడిపల్లికి బయలుదేరాడు. కాగా కొద్ది దూరం వెళ్లగానే లారీ ఢీకొంది. ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతి చె ందాడు. విషయం తెలుసుకున్న తనకల్లులోని బంధువులు, స్నేహితులు దేవరగూడిపల్లికి తరలివెళ్లారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 26 , 2024 | 11:39 PM