Share News

RICE MAFIA: సరిహద్దు దాటుతున్న పేదల బియ్యం

ABN , Publish Date - May 26 , 2024 | 11:46 PM

మండలం కర్ణాటక సరిహద్దున ఉండటంతో రేషన బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. ప్రతి రోజూ బియ్యాన్ని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు చూసినా కట్టడికి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

RICE MAFIA: సరిహద్దు దాటుతున్న పేదల బియ్యం
RATION RICE TRAVELLING IN AUTO (FILE)

సొమ్ము చేసుకుంటున్న అక్రమ వ్యాపారులు

పట్టించుకోని రెవెన్యూ, విజిలెన్స అధికారులు

బొమ్మనహాళ్‌, మే 26: మండలం కర్ణాటక సరిహద్దున ఉండటంతో రేషన బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. ప్రతి రోజూ బియ్యాన్ని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు చూసినా కట్టడికి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా ప్రభుత్వం బియ్యం అందించిన వెంటనే కూలీలు వారి ఇళ్ల వద్దకు వెళుతున్నారు. ఇంటింటికి తిరిగి బియ్యం ఉన్నాయా అమ్ముతారా అంటూ ద్విచక్రవాహనాలపై తిరుగుతూ అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ వారికి స్టోర్‌ బియ్యాన్ని విక్రయిస్తున్నారు. కిలో రూ.10 నుంచి రూ.12 ప్రకారం చెల్లించి కొంటున్నారు. గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని బస్తాల్లో నింపి ఆటోలు, ఇతర వాహనాలలో కర్ణాటకకు తరలిస్తున్నారు. స్టోర్‌ బియ్యం అక్రమార్కులకు కొందరు డీలర్లు ఎండీయూ వాహనదారులు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏ సమయంలో తరలిస్తున్నారన్న విషయం సంబంధిత అధికారులకు తెలిసినా కఠిన చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొమ్మనహాళ్‌ మండలంలో ప్రతి నెలా టన్నుల కొద్దీ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారంటే ఈ దందా ఏ మేరకు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. వీరిని కట్ట డి చేయాల్సిన అధికారులు లాలూచీపడి వాటాలు అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్టోర్‌ బియ్యం సరిహద్దులు దాటకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Updated Date - May 26 , 2024 | 11:46 PM