MLA KALAVA : మొక్కల సంరక్షణ బాధ్యత భావించాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:55 PM
ప్రతి ఒక్కరు మొక్కల సంరక్షణ బాధ్యతగా భావించాలని ఎమ్మె ల్యే కాలవ శ్రీనివా సులు పేర్కొన్నారు. మండలంలోని 75 వీ రాపురం నుంచి కేపీ దొడ్డి వరకు మూడు కిలోమీటర్ల చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన కార్యక్రమాన్ని ఆయన సోమవారం హాజరై ప్రారంభించారు. సర్పంచ నాగరాజు ఆధ్వర్యంలో 1200 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ... కుటుంబంలో ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి, దాని సంర క్షణ తీసుకోవాలని కోరారు.

గుమ్మఘట్ట, జూలై 8: ప్రతి ఒక్కరు మొక్కల సంరక్షణ బాధ్యతగా భావించాలని ఎమ్మె ల్యే కాలవ శ్రీనివా సులు పేర్కొన్నారు. మండలంలోని 75 వీ రాపురం నుంచి కేపీ దొడ్డి వరకు మూడు కిలోమీటర్ల చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన కార్యక్రమాన్ని ఆయన సోమవారం హాజరై ప్రారంభించారు. సర్పంచ నాగరాజు ఆధ్వర్యంలో 1200 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ... కుటుంబంలో ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి, దాని సంర క్షణ తీసుకోవాలని కోరారు. ఇలా చేస్తే రాష్ట్రం హరితాంధ్రప్రదేశగా మారుతుంద న్నారు. టీడీపీ మండల కన్వీనర్ గిరిమల్లప్ప, నాయకులు కాలవ సన్నన్న, సర్పంచ నాగరాజు, ఏపీఓ సురేష్, ఎంపీపీ భవాని, పంచాయతీ విస్తరణాధికారి సురేష్, ఈసీ అంజనకుమార్, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాయదుర్గం ప్రజల రుణం తీర్చుకంటా
రాయదుర్గం: అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన రాయదుర్గం పట్టణ ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుని వారి రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పట్టణంలోని 6, 9 వార్డుల టీడీపీ ఇనఛార్జ్‌లు పొరాళ్ల పురుషోత్తం, పొరాళ్ల గౌరి ఆధ్వర్యంలో సెయింట్ పాల్స్ స్కూల్ వద్ద ఆయనను ఘనంగా సత్కరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....