Share News

వలంటీర్ల రాజీనామాలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:39 PM

మండలంలోని శ్రీపురం (కోజ్జేపల్లి) గ్రామంలో ఆరుగురు గ్రామ, వార్డు వలంటీర్ల రాజీనామా చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసులుకి రాజీనామా పత్రలను అందజేశారు.

వలంటీర్ల రాజీనామాలు

గుత్తిరూరల్‌, ఏప్రిల్‌ 16: మండలంలోని శ్రీపురం (కోజ్జేపల్లి) గ్రామంలో ఆరుగురు గ్రామ, వార్డు వలంటీర్ల రాజీనామా చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసులుకి రాజీనామా పత్రలను అందజేశారు.

గోరంట్ల: మండలంలోని వడిగేపల్లి పంచాయతీలో 15మంది వలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు.

రాయదుర్గంరూరల్‌: మండలంలోని టీ వీరాపురం గ్రామానికి చెందిన ఐదుగురు వలంటీర్లు రాజీనామా చేశారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అల్లాబకా్‌షకు రాజీనామా పత్రాన్ని అందించారు.

రొళ్ల: మండలంలోని వివిధ పంచాయతీ గ్రామాల్లో పనిచేస్తున్న వలంటీర్లు రాజీనామా చేశారు. మంగళవారం రొళ్ల 1, 2 పంచాయతీలకు చెందిన వలంటీర్లు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీఓ ప్రసాద్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు.

Updated Date - Apr 16 , 2024 | 11:39 PM