Share News

విద్యాదీవెన సొమ్ము విడుదల

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:56 PM

జిల్లాలోని 40,006 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.29,07,75,479 విద్యాదీవెన సొమ్ము శుక్రవారం జమ అయినట్లు కలెక్టర్‌ గౌతమి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన పథకం సొమ్ము విడుదల కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు.

విద్యాదీవెన సొమ్ము విడుదల

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, మార్చి 1: జిల్లాలోని 40,006 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.29,07,75,479 విద్యాదీవెన సొమ్ము శుక్రవారం జమ అయినట్లు కలెక్టర్‌ గౌతమి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన పథకం సొమ్ము విడుదల కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. 7,104 మంది ఎస్సీ విద్యార్థులకు రూ. 4.69 కోట్లు, 1,635 మంది ఎస్టీ విద్యార్థులకు రూ. 1.15 కోట్లు, 19,968 మంది బీసీ విద్యార్థులకు రూ. 13.94 కోట్లు, 2,298 మంది కాపు విద్యార్థులకు రూ. 1.84 కోట్లు, 4,987 మంది ఈబీసీ విద్యార్థులకు రూ. 4.69 కోట్లు, 3,907 ముస్లిం, మైనార్టీ విద్యార్థులకు రూ. 2.70 కోట్లు, 107 మంది క్రిష్టియన మైనార్టీ విద్యార్థులకు రూ. 7 లక్షల సొమ్మును తల్లుల ఖాతాలో జమైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన బోయ గిరిజమ్మ, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు కొగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, జిల్లా వక్ఫ్‌బోర్డు ఛైర్మన రిజ్వాన, సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన మేడా రామలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన ఉమాదేవి, ఎస్సీ సంక్షేమశాఖ జేడీ మధుసూదనరావ్‌ పాల్గొన్నారు.

పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లాలో విద్యాదీవెన ద్వారా నిధులు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్‌ అరుణ్‌బాబు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఈమేరకు కలెక్టర్‌ మెగా చెక్కును విడుదల చేశారు. జిల్లాలోని 34,169 మంది విద్యార్థులకు సంబంధించి రూ.23.84కోట్ల విద్యాదీవెన సొమ్మును వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమాధికారి శివరంగప్రసాద్‌, గిరిజన సంక్షేమాధికారి మోహనరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:56 PM