Share News

ORGAN DONATION: అవయవదానంతో పునర్జన్మ

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:13 AM

వ్యాధులతో బాధపడుతూ, అవయవాలు లభించక దేశంలో రోజుకు 20మంది మరణిస్తున్నారని ఐఎంఏ స్టేట్‌ జాయింట్‌ సెక్రెటరీ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ హేమలత ఆవేదన వ్యక్తంచేశారు.

ORGAN DONATION: అవయవదానంతో పునర్జన్మ
A scene honoring Dr. Hemalatha

అనంతపురం సెంట్రల్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): వ్యాధులతో బాధపడుతూ, అవయవాలు లభించక దేశంలో రోజుకు 20మంది మరణిస్తున్నారని ఐఎంఏ స్టేట్‌ జాయింట్‌ సెక్రెటరీ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ హేమలత ఆవేదన వ్యక్తంచేశారు. అవయదానంతో దాతలు పునర్జన్మ పొందవచ్చునని ఆమె తెలిపారు. భారత అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జేఎనటీయూ ఓటీపీఆర్‌ఐ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ఎనఎ్‌సఎ్‌స ఆధ్వర్యంలో డైరెక్టర్‌ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సుకు ఆమె ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. రక్తదానం, నేత్రదానం, దేహదానం, అవయవదానం గురించి వివరించారు. దాతలుగా చేరాలనుకునే వారు జ్ట్టిఞట://్జ్ఛ్ఛఠ్చిుఽఛ్చీుఽ.్చఞ.జౌఠి.జీుఽ/ లేదా జ్ట్టిఞట://ుఽ్ట్టౌౌ.్చఛఛీఝ.జౌఠి.జీుఽ/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు. మొబైల్‌లోనే జీవన దాన, నోటో వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవచ్చునని తెలిపారు. హోమ్‌పేజీ ఓపెన కాగానే ప్రతిజ్ఞ(ప్లెడ్జ్‌) కనబడుతుందన్నారు. అంగీకరిస్తూ టిక్‌మార్క్‌ పెట్టిన వారు సభ్యులుగా నమోదు అవుతారన్నారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫోన నెంబర్‌, ఇతర వివరాలను భర్తీచేయడంతో డోనార్స్‌గా రిజిస్టర్‌ అవుతారని వివరించారు. అనంతరం డాక్టర్‌ హేమలతను సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ గోపినాథ్‌, డీఆర్‌ దుర్గాప్రసాద్‌, ఎనఎ్‌సఎ్‌స పీఓ లహరి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధిలు సీతామహాలక్ష్మి, అమర్నాథ్‌రెడ్డి, తిరుపాల్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 12:13 AM