Share News

నేడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ABN , Publish Date - May 21 , 2024 | 12:04 AM

పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉత్సవమూర్తులను ఆమిద్యాల నుంచి సోమవారం క్షేత్రానికి చేర్చారు. మొదట ఆమిద్యాలలోని పెన్నోబులేశుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నేడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ఉరవకొండ, మే 20: పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉత్సవమూర్తులను ఆమిద్యాల నుంచి సోమవారం క్షేత్రానికి చేర్చారు. మొదట ఆమిద్యాలలోని పెన్నోబులేశుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ ఊరేగింపుగా పెన్నహోబిలానికి తీసుకువచ్చారు. ఈవో విజయ్‌కుమార్‌, ప్రధానార్చకుడు ధ్వారకానాథాచార్యులు స్వామివార్లకు స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో మంగళ వారం అంకుర్పాణ చేయనున్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.

వాహన సేవలు...

బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ధ్వజారోహణం, ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. 22న సింహవాహనోత్సవం, చంద్రప్రభ వాహనోత్సవం, 23న గోవాహనోత్సవం, శేషవాహనోత్సవం, 24న హంసవాహనోత్సవం, 25న హనుమంత వాహనోత్సవం, 26న గరుడ వాహనోత్సవం, కల్యాణోత్సవం, 27న ఐరావత వాహనోత్సవం, 28న రథోత్సవం, 29న అశ్వవాహనోత్సవం, 30న ధ్వజావరోహణం, శయనోత్సవం నిర్వహిస్తారు. 31న ఉత్సవమూర్తులు పెన్నహోబిలం నుంచి ఆమిద్యాలకు చేరుస్తారు. అంతటితో ఉత్సవాలు ముగుస్తాయి.

Updated Date - May 21 , 2024 | 12:06 AM