Share News

భక్తిశ్రద్ధలతో రంజాన

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:06 AM

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌: రంజాన పర్వదిన వేడుకలను గురువారం పుట్టపర్తి, కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో ముస్లింలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు.

 భక్తిశ్రద్ధలతో రంజాన

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌: రంజాన పర్వదిన వేడుకలను గురువారం పుట్టపర్తి, కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో ముస్లింలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండలకేంద్రాలు, గ్రామాల్లో సైతం పెద్దఎత్తున పం డుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉదయమే స మీపంలోని ఈద్గా మైదానాలకు ర్యాలీగా వెళ్లి అక్కడ ముస్లిం మతపెద్దలు, ముతవల్లుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దానధర్మాలు, భక్తిశ్రద్ధలు, ఉపవాసాలకు ప్రతీక అయిన రంజాన పండగ గొప్పతనాన్ని మతపెద్దలు వివరించారు. అలాగే ఖుద్భా ప్రసంగం చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగ నం చేసుకుని ఈద్‌ముబారక్‌ చెప్పుకున్నారు. అదేవిధంగా మసీదుల్లో ప్రార్థనలు చేశారు. బంధుమిత్రుల ను ఇళ్లకు ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. ఈద్గామైదానాల వద్దకు పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - Apr 12 , 2024 | 12:06 AM