Share News

రాముడి పాలన ఆదర్శం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:09 AM

రాముడి పాలన అందరికీ ఆదర్శమని, అలాంటి పాలన మన రాష్ట్రంలో త్వరలో వస్తుందని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి పేర్కొన్నారు.

రాముడి పాలన ఆదర్శం
సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న వసుంధరాదేవి

నందమూరి వసుంధరాదేవి

సూగూరు ఆలయంలో నవమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు

హిందూపురం, ఏప్రిల్‌ 17 : రాముడి పాలన అందరికీ ఆదర్శమని, అలాంటి పాలన మన రాష్ట్రంలో త్వరలో వస్తుందని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి పేర్కొన్నారు. ఆమె బుధవారం శ్రీరామనవమి పండు గను పురస్క రించుకుని స్థానిక సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొ న్నారు. సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శ్రీరాముడి పాలన ప్రపంచానికే ఆదర్శమని అన్నారు. అలాంటి పాలన త్వరలో మనకఉ వస్తుందన్నారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి మాట జవదాటని రాముడి జీవిత చరిత్రను ఇప్పటి పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్నదమ్ములు కూడా రాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకో వాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సోదరి లోకేశ్వరి, శ్రీనివాస్‌, వసుంధర సోద రుడు ప్రసాద్‌, డాక్టర్‌ సురేంద్ర, సుధాకర్‌, టీడీపీ నాయకులు రమేష్‌, అనీల్‌కుమార్‌, వెంక టేశ, నెట్టప్ప, అమర్నాథ్‌, అశ్వత్థనారాయణరెడ్డి, రాఘవేంద్ర, నవీన, రాయల్‌గోపాల్‌, బాచి, ఐటీ ప్రొఫెషనల్‌ ప్రతిని ధి తేజశ్విని, పరిమళ, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:09 AM