Share News

రాష్ట్రంలో రామరాజ్యం రావాలి: ఎంఎస్‌ రాజు

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:55 PM

వైసీపీ అధికారంలోకి వచ్చాక రా ష్ట్రంలో రాక్షసరాజ్యం నడుస్తోం దని, అది పోయి రామరాజ్యం రావాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం ఎస్‌ రాజు, హిందూపురం పార్ల మెంటు అభ్యర్థి బీకే పార్థసారథి అన్నారు. వారు టీడీపీ నియోజక వర్గ సమ న్వయకర్త గుండుమల తిప్పేస్వామి తో కలిసి మంగళవారం అమరాపు రం మండలం బసవనపల్లి, ఆలద పల్లి, హేమావతి తదితర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా మ హి ళలు, రైతులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపిస్తూ గజమాలలతో గ్రామాల్లో స్వా గతం పలికారు.

రాష్ట్రంలో రామరాజ్యం రావాలి: ఎంఎస్‌ రాజు
MS Raju speaking during the election campaign

మడకశిరటౌన, ఏప్రిల్‌ 30: వైసీపీ అధికారంలోకి వచ్చాక రా ష్ట్రంలో రాక్షసరాజ్యం నడుస్తోం దని, అది పోయి రామరాజ్యం రావాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం ఎస్‌ రాజు, హిందూపురం పార్ల మెంటు అభ్యర్థి బీకే పార్థసారథి అన్నారు. వారు టీడీపీ నియోజక వర్గ సమ న్వయకర్త గుండుమల తిప్పేస్వామి తో కలిసి మంగళవారం అమరాపు రం మండలం బసవనపల్లి, ఆలద పల్లి, హేమావతి తదితర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా మ హి ళలు, రైతులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపిస్తూ గజమాలలతో గ్రామాల్లో స్వా గతం పలికారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో రాక్షసరాజ్యాన్ని పారదోలి, నారా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకొని రామరాజ్యం తెచ్చుకొందామని పిలుపునిచ్చారు. సైకో జగన ప్రభుత్వం రైతులను నట్టేట్లో ముంచిందని, రాష్ట్రాభి వృద్ధిని గాలికి వదిలేసిందని, మహిళ లకు రక్షణ లేదన్నారు. కక్షలు, కార్పణ్యాలతోనే పాలన సాగిస్తు న్నారని మండిపడ్డారు. టీడీపీ అధి కారంలోకి వచ్చాక స్థానికంగా వక్కల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత టీడీపీ హ యాంలో వక్కరైతులకు రైతుబంధు కింద రూ.2కోట్ల నిధులు అందించి ఆదుకొన్న ఘనత చంద్ర బాబుకే దక్కుతుందన్నారు.


మడకశిర ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ఏఒక్క అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమం చేపట్టలేదని, ప్రతి చిన్న విషయానికి డబ్బుతోనే ముడిపెట్టి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని ఎంఎస్‌రాజు, బీకే పార్థసారథికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, ఎస్సీ సెల్‌ నియోజకవర్గం అధ్యక్షుడు ఆర్‌ జయకుమార్‌, మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి, తెలుగు మహిళ నాయకురాలు మీనాక్షిరామిరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 30 , 2024 | 11:55 PM