Share News

Rally జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ర్యాలీ

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:50 AM

మం డలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటుచేయాలని కోరుతూ ఆల్‌ఇండి యా స్టూడెంట్స్‌ బ్లాక్‌ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.

 Rally   జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ర్యాలీ

యాడికి, జూలై14: మం డలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటుచేయాలని కోరుతూ ఆల్‌ఇండి యా స్టూడెంట్స్‌ బ్లాక్‌ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.


ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లేకపోవడంతో నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. ఉన్నత విద్యకు నోచుకోలేక ఎంతోమంది పేద విద్యార్థులు దినసరి కూలీలుగా మారుతున్నారన్నారు. యాడికిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటుచేస్తామని వైసీపీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు బూటకపు హామిలతో కాలయాపన చేశారని వాపోయారు. కూటమి ప్రభుత్వమైనా కళాశాలను ఏర్పాటుచేయాలని వారు కోరారు. ర్యాలీలో నాయకులు బుల్లెట్‌ శేఖర్‌, మహమ్మద్‌రఫీ, తరుణ్‌, బలరాం, ఉదయ్‌, మహి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 15 , 2024 | 12:50 AM