Share News

Rains: విస్తారంగా వర్షాలు

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:08 AM

గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో చెక్‌డ్యాంలు, కుంటలు నిండిపోయాయి. పలు చెరువుల్లో నీరు చేరింది. మే నెలలో 99.9 ఎంఎం వర్షం కురవగా, జూన నెలలో ఇప్పటికే దాదాపు 100 ఎంఎం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

Rains: విస్తారంగా వర్షాలు
The overflowing Muddalapuram pond

కూడేరు, జాన 8: గత పదిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో చెక్‌డ్యాంలు, కుంటలు నిండిపోయాయి. పలు చెరువుల్లో నీరు చేరింది. మే నెలలో 99.9 ఎంఎం వర్షం కురవగా, జూన నెలలో ఇప్పటికే దాదాపు 100 ఎంఎం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ముద్దలాపురం గ్రామ చెరువు పూర్తి నిండి మరువుపారుతోంది. కరుట్లపల్లి, ఇప్పేరు, రామచంద్రపురం చెరువుల్లోకి నీరు చేరింది. గత రెండు, మూడు సంవత్సరాలుగా వర్షాలు కురవక పోవడంతో బోరు బావులల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో అన్నదాతలు సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో బోరుబావుల్లో నీరు సంవృద్దిగా పెరుగుతుందని పలువురు రైతులు తెలిపారు. ఖరీఫ్‌ సీజనకు వర్షాలు అనుకులంగా వస్తుండటంతో పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 12:08 AM