Share News

ఘనంగా రాఘవేంద్రుడి ఆరాధనోత్సవాలు

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:21 PM

పట్టణంలోని బత్తలపల్లి రహదారి పక్కన ఉన్న మారుతీ రాఘవేంద్రస్వామి ఆలయంలో ఆరాధనోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.

 ఘనంగా రాఘవేంద్రుడి ఆరాధనోత్సవాలు

ధర్మవరం, ఆగస్టు 21 : పట్టణంలోని బత్తలపల్లి రహదారి పక్కన ఉన్న మారుతీ రాఘవేంద్రస్వామి ఆలయంలో ఆరాధనోత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రాఘవేంద్రస్వామి మూలవిరాట్‌ను వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం గణపతిపూజ, కలసపూజ, నవగ్రహ పూజను నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకోస్తం కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు.

Updated Date - Aug 21 , 2024 | 11:21 PM