సూపర్‌సిక్స్ పథకాలతో ప్రజా సంక్షేమం: జేసీ
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:00 AM
టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో ప్రజా సంక్షేమం సాధ్యమని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యాడికిలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీకి సంబంధించిన ప్రచార సామగ్రిని పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందజేశారు.

యాడికి, మార్చి5: టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో ప్రజా సంక్షేమం సాధ్యమని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యాడికిలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీకి సంబంధించిన ప్రచార సామగ్రిని పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమష్టిగా పనిచేసి టీడీపీని గెలిపించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు చవ్వా గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆదినారాయణ, రూపునేని రాజశేఖర్, మనోహర్‌చౌదరి, తిరంపురం నీలకంఠ, లక్ష్మణ్, నారాయణస్వామి, బొట్టు శేఖర్, మధురాజు, రామాంజనేయులు, విజయ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.