Share News

చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:15 AM

నంబుల పూల కుంట, ఏప్రిల్‌ 17 : చంద్రబాబుతోనే ప్ర జా సంక్షేమం సా ధ్యమని టీడీపీ కూ టమి ఎమ్మెల్యే అ భ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్‌ తె లిపారు.

చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం

- ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట

నంబుల పూల కుంట, ఏప్రిల్‌ 17 : చంద్రబాబుతోనే ప్ర జా సంక్షేమం సా ధ్యమని టీడీపీ కూ టమి ఎమ్మెల్యే అ భ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్‌ తె లిపారు. మండలంలోని పి.కొత్తపల్లి, పాపాన్నగారి పల్లి, బత్తినగారిపల్లి, పెడబల్లి గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు. చంద్రబాబుతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని, ఆయన సీఎం అయితేనే పరిపాలన సక్రమంగా, సజావుగా సాగుతుందని తెలిపారు. సూపర్‌ ిసిక్స్‌ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కందికుంటకు గ్రామాల్లో ప్రజలు, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. శ్రీరామనవమి సందర్భంగా ఆయా గ్రామాల్లోని రామాలయాల్లో కందికుంట ప్రత్యేకపూజలు చేశారు. పె డబల్లిలో ప్రచారం ముగించుకుని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ప్రజా స్పందన చూస్తుంటే రాబోయేది కూటమి ప్రభుత్వమేనని స్పష్టమవుతోందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఆధిపత్యానికి గండికొట్టేలా ప్రజలు తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి

అనంతపురం జిల్లాలో వైసీపీ తుడిచిపట్టిపోయేలా కనిపిస్తోందన్నారు. జిల్లా ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండల, గల్లీ స్థాయిల్లో ప్రచారం చేస్తున్నారంటే ఆ పార్టీ ఏపరిస్థితిలో ఉందో తెలుస్తోందన్నారు. సీఎం జగన ఎలాగైనా గెలవాలని గతంలో కోడికత్తి డ్రామా ఆడి ప్రస్తుతం గులకరాయి డ్రామాతో సానుభూతికి తెరలేపారన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. అనంతరం పి.కొత్తపల్లిలో వైసీపీకి మల్లప్పనాయుడితో పాటు పదిమంది టీడీపీలో చేరగా.. వారికి కందికుంట కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ చంద్రశేఖర్‌నాయుడు, సర్పంచలు చంద్రకళ, శ్రీహరిశర్మ, మాజీ సర్పంచ శ్రీరాములనాయుడు, రమణారెడ్డి, రామాంజులు, జయచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:15 AM