Primary Health Center ప్రాథమిక ఆరోగ్య కేంద్రం త నిఖీ
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:32 AM
జిల్లాకేంద్రంలోని ఎనుమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆరోగ్యశ్రీ జి ల్లా అధికారిణి శ్రీదేవి, డీఎంహెచఓ డాక్టర్ మంజువాణి బుధవా రం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆస్పత్రిలో ని రికార్డులను, మందులను, వ్యాధినిరోధక టీకాలను, అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్లను, నిల్వచేసే ఫ్రిడ్జ్‌లను, ల్యాబ్‌ను, కాన్పుల వార్డును పరిశీలించారు.

పుట్టపర్తి రూరల్, జూన 26: జిల్లాకేంద్రంలోని ఎనుమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆరోగ్యశ్రీ జి ల్లా అధికారిణి శ్రీదేవి, డీఎంహెచఓ డాక్టర్ మంజువాణి బుధవా రం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆస్పత్రిలో ని రికార్డులను, మందులను, వ్యాధినిరోధక టీకాలను, అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్లను, నిల్వచేసే ఫ్రిడ్జ్‌లను, ల్యాబ్‌ను, కాన్పుల వార్డును పరిశీలించారు.
అనంతరం డీఎంహెచఓ మాట్లాడుతూ రోగులకు అందించే వైద్యసేవలపై సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన వారికి అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్లపై అవగాహన కల్పించారు. అడల్ట్ బీసీజీ వ్యాక్సిన వేయించుకోవడం వల్ల క్షయవ్యాధి పూర్తిగా నయమవుతుందని, మళ్లీ తిరిగి రాదని తెలిపారు. ఐదేళ్లలో టీబీ వచ్చి తగ్గిపోయిన వారు, 60 ఏళ్ల వయసు నిండిన వారు, పొగ తాగేవారు, షుగ ర్ వ్యాధి ఉన్నవారు, ఎత్తుకు తగిన బరువు లేనివారు తప్పకుండా అడల్ట్ బీసీజీ వ్యాక్సిన వేయించుకోవాలని సూచించారు. వైద్యాధికారి శ్రీకాంత, సామాజిక ఆరోగ్య అధికారి నగేష్, స్టాఫ్‌నర్సు అమ్మాజీ, ఆరోగ్యశ్రీ లీడర్లు, ఆరోగ్యమిత్రలు, ఫార్మాసిస్టులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..