పెనుకొండ బాబయ్యకు ఎస్పీ చాదర్ సమర్పణ
ABN , Publish Date - Jul 13 , 2024 | 12:06 AM
పెనుకొండ బాబయ్యస్వామి దర్గాకు ఎస్పీ మాధవ రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా వెళ్లారు. దర్గా కమిటీ నిర్వాహకులు, మతపెద్దలు ఎస్పీ కుటుంబానికి స్వాగతం పలికారు.
పుట్టపర్తిరూరల్, జూలై 12: పెనుకొండ బాబయ్యస్వామి దర్గాకు ఎస్పీ మాధవ రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా వెళ్లారు. దర్గా కమిటీ నిర్వాహకులు, మతపెద్దలు ఎస్పీ కుటుంబానికి స్వాగతం పలికారు. ఛాదర్‌ను ఎస్పీ శిరస్సుపై మోసుకుంటూ దర్గాలోకి ప్రవేశించారు. బాబయ్య స్వామికి చాదర్‌ను సమర్పించి... ముజావర్లతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముజావర్లు దర్గా ప్రాశస్య్తం, విశిష్టతను ఎస్పీకి తెలిపారు. ఆయన వెంట పెనుకొండ సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ రంగడు, సిబ్బంది ఉన్నారు.