ఎనసీసీ సర్టిఫికెట్‌తో ఉద్యోగాల్లో ప్రాధాన్యం
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:14 AM
ఎనసీసీ సర్టిఫికెట్‌తో ఉద్యోగాలకు వెళ్లినపుడు ప్రాధాన్యముంటుందని కొడిగెనహళ్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మురళీధర్‌బాబు తెలిపారు.
హిందూపురం అర్బన, జనవరి 28: ఎనసీసీ సర్టిఫికెట్‌తో ఉద్యోగాలకు వెళ్లినపుడు ప్రాధాన్యముంటుందని కొడిగెనహళ్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మురళీధర్‌బాబు తెలిపారు. పరిగి మండలంలోని కొడిగెనహళ్లి గురుకుల పాఠ శాలలో ఆదివారం విద్యార్థులకు ఎనసీసీ ఏ సర్టిఫికెట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగాలకు ఎనసీసీ సర్టిఫికెట్‌పై వెయిటేజ్ మార్కులు ఉంటాయన్నారు. ఈ పరీక్షలకు ఏపీ ఆర్‌ఎస్ కొడిగెనహళ్లి, లేపాక్షి నవోదయ, హిందూపురం చిన్మ య, జడ్పీహెచఎస్ సోమందేపల్లి, జడ్పీహెచఎస్ పెనుకొండ, కిరికెర ఎల్‌ఆర్‌జీ పాఠశాలల నుంచి 202 మంది విద్యార్థులు హాజరయ్యారు. బాలుర విభాగానికి ఆరో ఆంధ్ర బెటాలి యన కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఎంఎస్ కులకర్ణి, బాలికల విభా గానికి కమాండింగ్ అధికారి కల్నల్ ఎల్‌డీ రోడ్రిక్స్ హాజరయ్యారు. పాఠశాల ఎనసీసీ అధికారి అరుణ్‌కుమార్, వివిధ పాఠశాలల ఎనసీసీ అధికారులు హాజరయ్యారు.