MLA MS RAJU : సమస్య రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:48 PM
సమస్య వచ్చినప్పుడు స్పందించడం కాదని, ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. ఆ యన శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణంలో వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డబ్యూఎస్ అధికారులు, ఎం పీడీఓలతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని కొంకల్లు, ఎం రాయాపురంలో డయేరియా ప్రబలిందని, అయి తే వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, ఇతర అధికారుల తో సమన్వయం చేసుకొంటూ సమస్య పరిష్కారానికి చొరవ చూపడం హర్షణీయమన్నారు.
అధికారులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సూచన
మడకశిరటౌన, ఆగస్టు 24 : సమస్య వచ్చినప్పుడు స్పందించడం కాదని, ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. ఆ యన శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఆవరణంలో వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డబ్యూఎస్ అధికారులు, ఎం పీడీఓలతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని కొంకల్లు, ఎం రాయాపురంలో డయేరియా ప్రబలిందని, అయి తే వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, ఇతర అధికారుల తో సమన్వయం చేసుకొంటూ సమస్య పరిష్కారానికి చొరవ చూపడం హర్షణీయమన్నారు. అయితే ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిం చారు. మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా ఈనెల 27, 28 తేదీలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పైప్‌ల మరమ్మతులకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టా లన్నారు. అదేవిధంగా నియోజక వర్గంలో ప్రతి ఇంటికి కొళాయి ఏర్పా టుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అధికారులు అందుకు అనుగుణంగా పనులు చేయాలని సూచించారు.
ఈసందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లికార్జున మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా 3.60లక్షల కొళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అవసరమైతే మరోలక్ష కొళాయి కనెక్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా మరో ఆరేడు నెలల్లో ప్రతి ఇంటికి కొళాయి అందించే విధంగా చర్యలు చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.... గత ప్రభుత్వంలో శ్రీరామరెడ్డి తాగునీ టి పథకం ద్వారా నీరు సరఫరా చేయకుండా, నిధులు స్వాహా చేశారని అన్నారు. శ్రీరామరెడ్డి నీటి సరఫరాకు నియోజకవర్గానికి సంబంధించి రూ.3కోట్ల అందిస్తున్నా ఆ ఉద్దేశం నెరవేరడం లేదని, ఇప్పటికైనా అధికారులు నాణ్యమైన తాగునీటిని అందిం చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవి కాలంలో ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి సమస్య ఉండకూడదన్నారు. ఈకార్యక్రమంలో డీఎంఅండ్‌హెచఓ మంజువాణి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మనూనాయక్, ఎంపీడీఓలు సోనీబాయి, ప్రసాద్, రామారావు, భాస్కర్, డాక్టర్లు శాంతి, ఐదు మండలాల ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....