Share News

ప్రకాష్‌... నీ డ్రామాలు ఆపు..!

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:23 AM

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి గ్రామాల్లో కొత్తతరహా అబద్దాలతో డ్రామాలు తెరలేపాడని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు.

ప్రకాష్‌... నీ డ్రామాలు ఆపు..!
కుర్లపల్లిలో కరపత్రాలు పంచుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత

ధర్మవరంరూరల్‌, జనవరి 7: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి గ్రామాల్లో కొత్తతరహా అబద్దాలతో డ్రామాలు తెరలేపాడని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. అతను ఇకనైనా ఆ డ్రామాలు ఆపాలని, వాటిని నమ్మే స్థితితో ప్రజలు లేరని అన్నారు. ఆదివారం బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కనగానపల్లి మండలంలోని కుర్లపల్లి, ఎగువతండా, దిగువ తండా, దాదులూరు గ్రామాల్లో ఆమె పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటీకి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం పరిటాల సునీత మాట్లాడుతూ.. ఆత్మకూరు, అనంతపురం రూరల్‌ పరిధిలో చాలారోజులుగా తాగునీటి సమస్య ఉందని, అధికారంలోకి వస్తానే సమస్యను పరిష్కారి స్తామని ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇన్నేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయ త్నాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని, కొన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తున్నట్లు డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. రాజధాని అమరావతి ప్రాంతం నుంచి రహస్యంగా తాగునీటి పైపులను తరలిస్తు న్నారని, అక్కడి రైతుల ఆందోళన చేపట్టిని విషయాన్ని గుర్తుచేశారు. అక్కడి నుంచి పైపులను రాప్తాడుకు తీసుకువచ్చి ఏదో గొప్పలు చేసినట్టు షోలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ఓ వైపు రాష్ట్రానికి రాజధాని లేకుండా సీఎం జగనరెడ్డి తీవ్ర అన్యాయం చేస్తే ఇప్పుడు ఆ ప్రాం తం నుంచి పైపులు తీసుకువచ్చి ప్రకాష్‌ రెడ్డి ప్రజలను మభ్య పెట్టే ప్రయ త్నం చేస్తున్నారని ఆరోపిం చారు. ప్రజ లు దీనిపై కచ్చి తంగా వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉం దన్నారు. కేవలం ఎన్నికల స్టంట్‌ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెట్టెం వెంకటేష్‌, కన్వీనర్‌ యాతం పోతలయ్య, తలారి రాజప్ప, సుధాకర్‌ చౌదరి, ముకుంద నాయుడు, ఎంపీటీసీ బిల్లేభాస్కర్‌, పూజారి రాజాకృష్ణ, బిల్లే దామోదర్‌, కుర్లపల్లి చంద్ర, బాలు నాయక్‌, లింగమయ్య, ఓబి లేసు, కేశవ, ప్రసాద్‌, వెంకటరాముడు, నరేం ద్రరెడ్డి, ఆదెప్ప, నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:23 AM