Share News

ప్రకాష్‌రెడ్డికి పరాజయం తప్పదు

ABN , Publish Date - Apr 01 , 2024 | 12:04 AM

యోజకవర్గంలో ఐదేళ్లగా ఏ ఒక్క రోజూ ప్రజల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి ఎన్నికల్లో ఓటమి తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.

ప్రకాష్‌రెడ్డికి పరాజయం తప్పదు
పరిటాల సునీతతో కలిసి విక్టరీ గుర్తు చూపుతున్న మహిళలు

ప్రజాసమస్యలను పట్టించుకున్న పాపానపోలేదు

ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధం

మాజీ మంత్రి పరిటాల సునీత

చెన్నేకొత్తపల్లి, మార్చి 31: నియోజకవర్గంలో ఐదేళ్లగా ఏ ఒక్క రోజూ ప్రజల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి ఎన్నికల్లో ఓటమి తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని బ్రాహ్మణపల్లి, ఎర్రోనిపల్లి, గంగినేపల్లి, వెల్దుర్తి, బసంపల్లి గ్రామాలలో ఆదివారం ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పరిటాల సునీతకు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు 52 నియోజవర్గాల నుంచి 5 వేల బస్సులు, ఇతర వాహనాలలో జనాలు తరలించిన ఎమ్మెల్యే వాపును బలుపుగా చెప్పుకుంటున్నాడని ఎద్దెవాచేశారు. ఆయన చదువుకున్నా సంస్కారం లేని వ్యక్తి అని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు పేద అరుపులు అరసి సానుభూతితో ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ఆ తరువాత అతని నిజస్వరుపం ఏమిటో ప్రజలకు చూపించాడన్నారు. ముఖ్యంగా నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీలోని చాలామంది నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇన్ని రోజులు అధికారం ఉందని పోలీసులు, అధికారులు సహకరించారని ఇకపై అటలు సాగవన్నారు. మే 13వ తేదీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఆ రోజు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతాయన్నారు. పేరూరు ప్రాజెక్టుకు నీరు తీసుకురావడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు ఎల్‌ నారాయణచౌదరి, బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్దిరంగయ్య, మండలకన్వీనర్‌ ముత్యాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబుళేశు, ముత్యాలప్ప, రామసుబ్బమ్మ, ఎజ్జే శంకర్‌, అంకే అమరేంద్ర, ప్రసాదమ్మ, నాగరాజు, హరి, ఫణీంద్ర, చండ్రాయుడు, బయన్న, మాడెం సూర్యనారాయణరెడ్డి, బెస్త నాగార్జున, ఐటీడీపీ పవన, రామాంజి, శివ, అస్మత, వరలక్ష్మి, సూరి, ఓబిరెడ్డి పాల్గొన్నారు.

============================

పొత్తు ధర్మాన్ని పాటిద్దాం

ఫ ఆగ్రహావేశాలు వద్దు... సంయమనం పాటించండి

ఫ జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, మార్చి 31: అనంతపురం అర్బన టిక్కెట్‌ కేటాయింపు విషయంలో జనసేన అధినేత పవనకళ్యాణ్‌ ఆదేశాలే శిరోధార్యంగా పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రతిఒక్కరూ పొత్తు ధర్మాన్ని పాటించాలని సూచించారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో టీసీ వరుణ్‌ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. పలువురు నేతలు, వీర మహిళలు అనంత టిక్కెట్‌ దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి కుటుంబాలు, వ్యాపారాలు వదులుకొని కష్టపడ్డామన్నారు. జిల్లాలో పార్టీని ఎంతో బలోపేతం చేసిన వరుణ్‌కు కాకుండా టీడీపీకి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీసీ వరుణ్‌ కలుగుజేసుకొని ఆగ్రహావేశాలు వద్దు... సంమయమనం పాటించండి. అధినేత ఆదేశాల మేరకు పొత్తు ధర్మాన్ని ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి జన సైనికుడు కష్టపడి పనిచేసి అభ్యర్థిని గెలిపించాలన్నారు. నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య పాల్గొన్నారు.

మాట్లాడుతున్న టీసీ వరుణ్‌

=========================

వ్యవసాయంపై లండన విద్యార్థులకు అవగాహన

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 31: లండనలోని కింగ్జ్‌ కాలేజ్‌కి చెందిన విద్యార్థులు సహజ వ్యవసాయ విధానాలపై అవగాహన పొందుతున్నారు. కింగ్స్‌ గ్లోబల్‌ డే ఆఫ్‌ సర్వీస్‌, ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ (ఆసియోన ఫ్రొటెర్నా) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రాప్తాడు మండలం రామినేపల్లి గ్రామంలో రైతులతో ముఖాముఖిలో లండన విద్యార్థులు గివింగ్‌ బ్యాక్‌ టు సొసైటీ ప్రచారంలో భాగంగా సహజ వ్యవసాయ విధానాలపై వివరించారు. ఆవు పేడ, బెల్లం, పుట్ట నుంచి మట్టి, ఆవు మూత్రంతోపాటు పొడి పప్పును పిండి చేశారు. అనంతరం అక్కడ నుంచి ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ వరకు రైతులు ర్యాలీగా బయలుదేరి వచ్చారు. ఎకాలజీ సెంటర్‌లో కమ్యూనిటీ న్యాచురల్‌ ఫార్మింగ్‌ యాప్‌ పోస్టరు విడుదల, రైతు అవార్డులు ప్రదానం చేశారు. కరవు జిల్లాలో సామాజిక సహజ వ్యవసాయంతో అనేక లాభాలు, ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి అవగాహన కల్పించేందుకు లండన నుంచి ఇక్కడికి రావడం అభినందనీయమని ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ మల్లారెడ్డి అన్నారు. జిల్లాలో వ్యవసాయానికి అనుకూలంగా నేలలు, పరిస్థితులు ఉన్నాయని లండన కింగ్స్‌ కాలేజ్‌ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపకుడు స్టీఫెన అనురాగ్‌ తెలిపారు. సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ రుద్రయ్య, ఏఎఫ్‌ ఎకాలజీ సీఎనఎ్‌ఫ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ ఖలీల్‌అహ్మద్‌, సంఘం సభ్యులు హర్‌ సహాయ్‌ మీనా, అకాష్‌ పొద్దార్‌, తేజ త్రిభునవ్‌ బోయ, జాకీర్‌హుస్సేన, సాహిల్‌ఖాదర్‌, హర్ష సాకే, అఖిల్‌రవి, ఇంద్రజ పాల్గొన్నారు.

వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తున్న నిపుణులు

====================

అందరినీ కలుపుకుని ముందుకెళ్తా..!

ఫ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌

అనంతపురం అర్బన, మార్చి 31: అనంతపురం అర్బన నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు వెళతానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. ఆదివారం స్థానిక శ్రీనగర్‌ కాలనీలో అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ... సోమవారం నుంచి నాయకులను వ్యక్తిగతంగా కలిసి ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామన్నారు. అనంత అర్బనలో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. విజయం సాధించి ఈ సీటును చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. నాయకులు రాళ్లపల్లి అనంతయ్య, బుగ్గయ్యచౌదరి, సురేష్‌, మారుతీనాయుడు, మహేష్‌ పాల్గొన్నారు.

దగ్గుబాటిని గెలిపించి.. టీడీపీ జెండా ఎగురవేస్తాం

- యువనేత ఉమర్‌ ముక్తార్‌

అనంతపురం ప్రెస్‌క్లబ్‌: రానున్న ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్టీ జెండాను ఎగురవేస్తామని జడ్పీ మాజీ చైర్మన చమనసాబ్‌ తనయుడు, యువనేత ఉమర్‌ ముక్తార్‌ అన్నారు. రామ్‌నగర్‌లోని చమనసాబ్‌ నివాసానికి ఆదివారం వెళ్లిన దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ చమనసాబ్‌ సతీమణి రమీజా, తనయుడు ఉమర్‌ ముక్తార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారు దగ్గుబాటిని సన్మానించారు. ముక్తార్‌ మాట్లాడుతూ... వెంకటేశ్వర ప్రసాద్‌ తమ కుటుంబానికి ఎంతో ఆప్తులన్నారు. ఆయన గెలుపు కోసం అన్ని శక్తులను ఏకం చేసి పనిచేస్తామన్నారు. మైనార్టీ విభాగం అధ్యక్షుడు సైఫుల్లా, నాయకులు హరి, చాంద్‌, బాషా, బుక్కచర్ల లక్ష్మీనారాయణరెడ్డి, దూదేకుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

అనంత అర్బన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌

====================

Updated Date - Apr 01 , 2024 | 12:04 AM