Share News

పవర్‌లూమ్స్‌ కార్మికులకు ఇళ్ల స్థలాలివ్వాలి

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:53 PM

పవర్‌లూమ్స్‌ కార్మికులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీసీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీసీఐ ఆధ్వర్యంలో పవర్‌ లూమ్స్‌ కార్మికులు గురువారం ధర్నా చేపట్టారు.

పవర్‌లూమ్స్‌ కార్మికులకు ఇళ్ల స్థలాలివ్వాలి
గోరంట్ల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పవర్‌లూమ్స్‌ కార్మికుల ధర్నా

సీపీఐ నాయకుల డిమాండ్‌

గోరంట్ల, మార్చి 14: పవర్‌లూమ్స్‌ కార్మికులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీసీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీసీఐ ఆధ్వర్యంలో పవర్‌ లూమ్స్‌ కార్మికులు గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ మండ ల కార్యదర్శి సుధాకర్‌ తదితరులు మాట్లాడుతూ... గోరంట్లలోని చౌడేశ్వరీకాలనీ, తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న పవర్‌లూమ్స్‌ కార్మికులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఫలితంలేదని ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పవర్‌లుమ్స్‌ కార్మికులకు ఇళ్లస్థలాలు మంజూరు చేసి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తహసీల్దార్‌ అక్బల్‌బాషాకు వారు వినతిపత్రం అందించారు. సీపీఐ మండల సహాయ కార్యదర్శి సురేష్‌, ప వర్‌లూమ్స్‌ కార్మిక సంఘం నాయకులు రామక్రిష్ణ, వెంకటేష్‌, మనోహర్‌, శ్రీని వాసులు, మేస్త్రీ శ్రీనివాసులు, శంకర్‌, మహేష్‌; ఈశ్వరయ్య, బాబు పాల్గొన్నారు.

ఇళ్ల స్థలాల పట్టాలు సాధించుకుందాం

లేపాక్షి : ఇళ్లులేని నిరుపేదలు ప్రభుత్వంతో పోరాటం చేసి ఇళ్ల పట్టాలు సాధించుకుందామని సీపీఐ మండల కార్యదర్శి శివప్ప అన్నారు. ఇళ్లులేని నిరుపేదలు సీపీఐ నాయకులతో కలిసి మండలంలోని లేపాక్షి - కంచి సముద్రం ప్రధాన రహదారిలో సర్వేనంబరు 358, 361లో ఉన్న ప్రభుత్వ భూమిలో గురు వారం ఉదయం జెండాలు పాతారు. ఈ సందర్భంగా శివప్ప మాట్లాడుతూ... ఇళ్లులేని నిరుపేదల కోసం తహసీల్దార్‌ కార్యాల యం చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదన్నారు. దీంతో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అందులో ఇళ్లు నిర్మించ డమే సీపీఐ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఇళ్లులేని నిరుపేదలు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 11:53 PM