Share News

అక్రమ మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:43 PM

నకిలీ వే బిల్లుల మాటున అక్రమంగా తరలించిన మద్యాన్ని స్వాధీనంచేసుకుని ఒకరిని అరెస్టు చేసినట్టు ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

అక్రమ మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు
స్వాధీనం చేసుకున్న మద్యాన్ని చూపుతున్న డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు

తాడిమర్రి, మార్చి 22: నకిలీ వే బిల్లుల మాటున అక్రమంగా తరలించిన మద్యాన్ని స్వాధీనంచేసుకుని ఒకరిని అరెస్టు చేసినట్టు ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషనలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాలను వెల్లడించారు. శుక్రవారం దాడితోట వద్దనున్న అంతర్‌జిల్లా చెక్‌పోస్టులో స్థానిక ఎస్‌ఐ నాగస్వామి తన సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా లారీలో తరలిస్తున్న అక్రమ మద్యం 830 బాక్సుల (రూ.1.50లక్ష) స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై తాడిమర్రి పోలీ్‌సస్టేషనలో రెండు కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం 9 మందిపై కేసులు నమోదు చేసి ఒకరిని అదుపులోకితీసుకున్నట్టుగా తెలిపారు. వారిలో ధర్మవరం పట్టణం కేతిరెడ్డికాలనీకి చెందిన షాహిద్‌ఖాన, దేవానంద్‌, రజనీకుమార్‌, శింగనమల మండలం కొరివిపల్లికిచెందిన దూదేకుల కుళ్లాయస్వామి, బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరుకు చెందిన మాలపాటి రవితేజ, యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన సురేశ, నాగరాజు, తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లికి చెందిన కమ్మ నరేశలపై కేసు నమోదు చేశామన్నారు. దాడిలో పాల్గొన్న తాడిమర్రి ఎస్‌ఐ నాగస్వామి, సిబ్బందిని డీఎస్పీ, సీఐ కృష్ణంరాజు నాయక్‌ అభినందించారు.

గొలుసు వ్యాపారాన్ని ఛేదించిన పోలీసులు: అక్రమ మద్యం వ్యాపారం తరచుగా జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు అడ్డుకట్ట వేయకలిగారు. తాడిమర్రిలోని చెత్తతో సంపద సృష్టి కేంద్రంలో నిల్వచేసిన 15 కేసుల గోవా మద్యాన్ని రెండురోజుల క్రితంస్వాఽధీనం చేసుకున్న పోలీసులు ఈ రెండు రోజుల్లో వారు కూపి లాగి అడ్డుకట్ట వేయకలిగారు. కేతిరెడ్డికాలనీకి షాహీద్‌ఖాన, తాడిపత్రిలో ఏపీ 02 టీబీ5353 నెంబరు గల లారీని రూ.11లక్షలకు కొనుగోలు చేసి కొరివిపల్లికి చెందిన కుళ్లాయస్వామిని డ్రైవర్‌గా నియమించుకుని అక్కడి నుంచి లారీని గోవాకు తీసుకెళ్లారు. గోవా నుంచి ఆంధ్రప్రదేశకు మద్యాన్ని తరలించేందుకు ఉపయోగించే బ్యాక్‌అండ్‌బ్యాక్‌ అప్లికేషన యాప్‌లో వివరాలు నమోదు చేశారు. దీనికి సంబఽంధించి గోవా ప్రభుత్వం ఈ లారీలో మద్యం తరలించేందుకు అనుమతి ఇచ్చింది. దాని ప్రకారం 850 కేసులు మద్యం లోడు చేసుకుని గోవా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇం దుకు సంబంధించి వే బిల్లులుతీసుకుని వాటిని మదనపల్లి, రేణిగుంట, చిత్తూరులో అనలోడ్‌చేసేందుకు తగిన పత్రాలు పొందుతారు. అదనంగా 90 కేసులు దొంగమద్యం అందులో వేసుకుని గోవా నుంచి హొసపేట, బళ్లారి, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, బత్తలపల్లికి చేరుకున్న తరువాత బత్తలపల్లి సరిహద్దులు దాటిన అనంతరం90 కేసుల మద్యాన్ని షాహిద్‌కు అందజేసి మిగిలిన దాన్ని నిబంధనల ప్రకారం సరఫరా చేసేందుకు లారీవెళ్లిపోతుంది. అయితే 90 కేసుల మద్యాన్ని మాత్రం ధర్మవరం, తిమ్మంపల్లి గ్రామాలకు సరఫరా చేస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది.

Updated Date - Mar 22 , 2024 | 11:43 PM