పోలింగ్ సజావుగా జరుపుతాం
ABN , Publish Date - May 12 , 2024 | 12:03 AM
అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు ఏర్పాటు చేసి, పోలింగ్ సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టరు వినోద్ కుమార్, ఎస్పీ అమితబర్దర్ తెలిపారు.

అనంతపురం టౌన, మే11: అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు ఏర్పాటు చేసి, పోలింగ్ సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టరు వినోద్ కుమార్, ఎస్పీ అమితబర్దర్ తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం సీపీఎఫ్ కమాండెంట్‌లతో వారు సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ పోలింగ్ సమయంలో సీపీఎఫ్ కమాండెంట్‌ల పాత్ర చాలా కీలకమన్నారు. జిల్లాలో పలు క్రిటికల్ కేంద్రాల ను గుర్తించి అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి కేంద్రబలగాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని పోలింగ్ స్టేషనలలోను వందశాతం వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు మీడియా, ఎన్నికల అధికారులకు పాస్‌లు జారీ చేశామని, అవి ఉన్న వారిని మాత్రమే కేంద్రాలలోకి అనుమతించాల న్నారు. ఓటర్లు, అభ్యర్థులు, ఏజెంట్లతో మర్యాదగా వ్యవహరించాలన్నారు.