Share News

POLLIING : హంగులు, రంగులతో పోలింగ్‌ కేంద్రాలు

ABN , Publish Date - May 12 , 2024 | 12:32 AM

సార్వత్రిక ఎన్నికల కోసం ప్రజలను ఆకర్షించే విధంగా వినూత్న రీతిలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెనుకొండ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల కోసం పింక్‌ పోలింగ్‌ కేంద్రం, సోమందేపల్లిలో యువత కోసం యూత పోలింగ్‌ కేంద్రం, పెనుకొండలో అన్ని హంగులతో మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పా టు చేస్తున్నట్లు పెనుకొండ మున్సిపల్‌ కమిషనర్‌, ఎన్నికల నోడల్‌ ఆఫీసర్‌ వంశీకృష్ణభార్గవ్‌ తెలిపారు. గోరంట్ల బాలికల ఉన్నత పాఠశాలలోని 245 పోలింగ్‌ కేంద్రాన్ని పింక్‌ రంగుతో అలంకరించా రు.

POLLIING : హంగులు, రంగులతో పోలింగ్‌ కేంద్రాలు
Officials conducting the polling mock trial

గోరంట్ల, మే 11: సార్వత్రిక ఎన్నికల కోసం ప్రజలను ఆకర్షించే విధంగా వినూత్న రీతిలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెనుకొండ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల కోసం పింక్‌ పోలింగ్‌ కేంద్రం, సోమందేపల్లిలో యువత కోసం యూత పోలింగ్‌ కేంద్రం, పెనుకొండలో అన్ని హంగులతో మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పా టు చేస్తున్నట్లు పెనుకొండ మున్సిపల్‌ కమిషనర్‌, ఎన్నికల నోడల్‌ ఆఫీసర్‌ వంశీకృష్ణభార్గవ్‌ తెలిపారు. గోరంట్ల బాలికల ఉన్నత పాఠశాలలోని 245 పోలింగ్‌ కేంద్రాన్ని పింక్‌ రంగుతో అలంకరించా రు.


ముఖ ద్వారం వద్ద ఓటర్లకు స్వాగతం పలుకుతూ సఖి పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు పింక్‌రంగు తివాచీ, ఇరువైపులా పూలకుండీలు ఏర్పాటు చే శారు. పింక్‌ పోలింగ్‌ కేంద్రాన్ని నోడల్‌ ఆఫీసర్‌ వంశీకృష్ణభార్గవ్‌, తహసీల్దార్‌, ఏఆర్‌ఓ అక్బల్‌బాషా, ఎంపీడీఓ, ఎంసీసీ అధికారి ప్రవీణ్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. అధికారులు పోలింగ్‌ బీ ఎల్‌ఓలను, ఎన్నికల నిర్వాహక అధికారుల స్థానంలో కూర్చోపెట్టి మాక్‌ ట్రైల్‌ నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రం ద్వారా 588 మంది మహిళలు, 593 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఎన్నికలకు పండుగ వాతావరణ కల్పించడంతో అధికా రులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్పెషలాఫీసర్‌ బాలాజీ ప్రసాద్‌, వీ ఆర్‌ఓ అనిల్‌కుమార్‌, మన్సూర్‌, చంద్రకళ, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 12 , 2024 | 12:32 AM