పోలీస్ వాహనం బోల్తా
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:54 PM
మండలంలోని పులేకమ్మ గుడివద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు డీఎస్పీ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డీఎస్పీ బాబిజానసైదతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

పెనుకొండ రూరల్, జూన 7: మండలంలోని పులేకమ్మ గుడివద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు డీఎస్పీ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డీఎస్పీ బాబిజానసైదతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు డీఎస్పీతో పాటు హెడ్‌కానిస్టేబుల్ మధుసూదన, నాగరాజు, హోంగార్డు జబీవుల్లా, డ్రైవర్ భైవరశెట్టి కారులో సోమందేపల్లి స్టేషనకు వెళ్లి తిరిగి పెనుకొండకు వస్తున్నారు. పెనుకొండ సమీపంలోని పులేకమ్మ ఆలయం వద్దకు రాగానే పెనుకొండ వైపునుంచి ఓ ద్విచక్రవాహనదారుడు యూటర్న్ తీసుకుంటుండగా డీఎస్పీ వాహనం అతనిని తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డీఎస్పీ ఎడమచేతికి స్వల్పగాయమైంది. హెడ్‌కానిస్టేబుల్ మధుసూదన, నాగరాజు, హోంగార్డు జబీవుల్లా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన వాహనంలో నుంచి వారిని బయటికి తీశారు. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి మరో కారులో తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం హెడ్‌కానిస్టేబుల్ మధుసూదనను అనంతపురం ఆస్పత్రికి తరలించారు.