WATER : పైప్‌లైన పగిలి నీరు వృథా
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:05 AM
పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇస్లాపురం రైల్వే గేటు ఫ్లైఓవర్ వద్ద తాగునీటి పైప్‌లైన పగిలి నీరు వృఽథాగా వెళ్తోంది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి తిమ్మాపురం, పెనుకొండ పట్టణానికి, చుట్టుపక్కల గ్రామాలకు నీటిని అందించేందుకు ఈ పైప్‌లైన వేశారు. గత టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే బీకే పార్థసారథి చొరవతో రూ. లక్షలు వెచ్చించి వేసిన ఈ పైప్‌లైన ద్వారా నీటిని అందిస్తున్నారు.

పెనుకొండ రూరల్, జూలై 4 : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇస్లాపురం రైల్వే గేటు ఫ్లైఓవర్ వద్ద తాగునీటి పైప్‌లైన పగిలి నీరు వృఽథాగా వెళ్తోంది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి తిమ్మాపురం, పెనుకొండ పట్టణానికి, చుట్టుపక్కల గ్రామాలకు నీటిని అందించేందుకు ఈ పైప్‌లైన వేశారు. గత టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే బీకే పార్థసారథి చొరవతో రూ. లక్షలు వెచ్చించి వేసిన ఈ పైప్‌లైన ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే ఇస్లాపురం రైల్వేగేటు ఫ్లైఓవర్ వద్ద కొన్ని రోజుల నుంచి తాగునీటి పైప్‌లైన పగిలి నీరంతా సమీపంలోని డ్రైనేజీ లోకి వెళ్తోంది. పైప్‌లైన పగలడంతో తిమ్మాపురం, పెనుకొండలోని పలు కాలనీవాసులు తాగునీరు చేరక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా నగర పంచాయతీ అధికారులు స్పందించి పగిలిన పైప్‌లైన మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....