Share News

CRIME: వరుస చోరీలతో జనం బెంబేలు..!

ABN , Publish Date - May 31 , 2024 | 11:54 PM

ప్రజలు ఇంటికి తాళం వేశారంటే చోరీ రూపంలో మూల్యం చెల్లించుకోవల్సిన పరిస్థితి గోరంట్ల పట్టణంలో నెలకొంది. అత్యవసర పరిస్థితిలో ఇంటికి రాత్రివేళ తాళం వేసి మరో ప్రాంతానికి లేదా మిద్దెపై నిద్రించినా, వారికి మూడినట్లే. దొంగల వీరవిహారం చేస్తున్నారు.

CRIME: వరుస చోరీలతో జనం బెంబేలు..!
Scattered clothes at Vadde Kishtappa's home (File)

ఇళ్లకు తాళాలు వేయాలంటే భయం.. భయం..

పోలీసులకు సవాల్‌ విసురుతున్న దొంగలు

గోరంట్ల, మే 31: ప్రజలు ఇంటికి తాళం వేశారంటే చోరీ రూపంలో మూల్యం చెల్లించుకోవల్సిన పరిస్థితి గోరంట్ల పట్టణంలో నెలకొంది. అత్యవసర పరిస్థితిలో ఇంటికి రాత్రివేళ తాళం వేసి మరో ప్రాంతానికి లేదా మిద్దెపై నిద్రించినా, వారికి మూడినట్లే. దొంగల వీరవిహారం చేస్తున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి గోరంట్లలో నెలకుంది. మూడునెలలుగా వరుస చోరీల సంఘటనలే ఇందుకు ఉదాహరణ. పట్టణంలోని వినాయక్‌ నగర్‌లో చాకలి శ్రీనివాసులు మార్చి 5న ఇంటికి తాళం వేసి, ఇరుముడి కోసం శివాలయానికి వెళ్లి, గంటలోపు తిరిగిరాగా, అప్పటికే దుండగులు చోరీ చేశారని భార్య చాకలి శైలజ తెలిపారు. తాళం పగలకొట్టి బీరువాలోని ఐదు తులాల బంగారు నగలు, కుమారుడి ఫీజుకోసం దాచిన రూ.1.50లక్షల నగదు దుండగులు ఎత్తుకెళ్లారని వాపోయింది. బూడిదదిన్నెలోని చేనేత కార్మికుడు వేణుగోపాల్‌ ఇంటిలో ఏప్రిల్‌ 4న 35గ్రాముల బంగారు వస్తువులు, రూ.2 లక్షల నగదు చోరీ జరిగింది. అక్కడికి సమీపంలోని పంచాయతీ వాటర్‌ మ్యాన జయచంద్ర పట్టణంలోని కొళాయిలకు నీరు వదల డానికి వెళ్లారు. జయచంద్ర భార్య ఒక్కటే నిద్రించలేక, బంధువులింటికి వెళ్లగా 30గ్రాముల బంగారం, రూ.40వేలు నగదు ఎత్తుకెళ్లారు. అదే రోజు తెల్లవారుజామున బాలికల ఉన్నతపాఠశాల సమీపంలో శివకుమార్‌ ఇంటిముందుంచిన ఆటో చోరీ జరిగింది. ఏప్రిల్‌ 6న చలమయ్యగారిపల్లిలో ఎరుకుల నరే్‌షకు చెందిన రూ.2.10లక్షల విలువ చేసే 15 పందులను గుర్తుతెలియన వ్యక్తులు ఎత్తుకెళ్లారు.


20వతేదీన గోరంట్లకు చెందిన హేమాప్రతాప్‌ తీర్థయాత్రలకు వెళ్తుండగా హ్యాడ్‌బ్యాంగ్‌లోని 42గ్రాముల నక్లెస్‌ బస్టాండ్‌లో చోరీ చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌ 24న రాత్రి రాజీవ్‌ కాలనీలోని నాలుగు నివాస గృహాల్లో చోరీలు జరిగాయి. కృష్ణరావు ఇంటిలో 65గ్రా. బంగారు నగలు, రూ.60వేలు నగదు చోరీ చేశారు. 10వ తేదీన తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో బంగా రు వ్యాపారి కేశవాచారీ, అతని దంపతులు తాళం వేసి సమీప గ్రామంలో సీమంతం కార్యక్రమానికి వెళ్లగా 150గ్రా. బంగా రు, రూ.4.10 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. 21న పులేరు రోడ్డు లో నివాసముంటున్న చేనేత కార్మికుడు వడ్డె క్రిష్టప్ప కుటుం బం తాళం వేసి తిరుపతికి వెళ్లి తిరిగి రాగా 67గ్రా. బంగారు నగలు, 40గ్రా. వెండి, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి పాలసము ద్రం గ్రామంలోని కెనరాబ్యాంక్‌ ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎంలో ఏర్పాటు చేసి సెన్సార్‌ కారణంగా వెంటనే హెడ్‌ ఆఫీసర్‌కు సమాచారం వెళ్లగా, బ్యాంక్‌ మేనేజర్‌ లక్ష్మీపతినాయక్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే పోలీసులు స్పందించి సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా అదే గ్రామానికి చెందిన నవీన అనే వ్యక్తిని అదులోకి తీసుకున్నారు.


చోరీలపై ప్రత్యేక దృష్టి

గోరంట్లలో చోరీలు జరుగుతున్నా, పోలీసులు ఎన్నికల విధినిర్వాహణలో ఉండటం వల్ల తీరిక లేకపోవడంతో వారి ఆటలు సాగుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌ ముగిసిన తరువాత చోరీలపై ప్రత్యేక దృష్టి సారించి, అరికడతాం.

- బాజీజానసైదా డీఎస్పీ, పెనుకొండ

Updated Date - May 31 , 2024 | 11:54 PM