Share News

Peddareddy's irregularities are innumerable పెద్దారెడ్డి అక్రమాలు లెక్కలేనివి

ABN , Publish Date - Aug 24 , 2024 | 01:23 AM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ మహిళా కౌన్సిలర్లు జింకా లక్ష్మిదేవి, రేష్మాపర్వీన, సరస్వతి, అరుణలు విరుచుకుపడ్డారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణ లో శుక్రవారం మహిళా కౌన్సిలర్లు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దారెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు లెక్కలేనివన్నారు.

Peddareddy's irregularities are innumerable  పెద్దారెడ్డి అక్రమాలు లెక్కలేనివి

- విరుచుకుపడ్డ టీడీపీ మహిళా కౌన్సిలర్లు

తాడిపత్రి, ఆగస్టు23: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ మహిళా కౌన్సిలర్లు జింకా లక్ష్మిదేవి, రేష్మాపర్వీన, సరస్వతి, అరుణలు విరుచుకుపడ్డారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణ లో శుక్రవారం మహిళా కౌన్సిలర్లు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దారెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు లెక్కలేనివన్నారు.


అప్పటి ప్రభుత్వం అవినీతిపై గళం విప్పినందుకు కేసులు పెట్టించడం దారుణమన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా తమపై 307 కేసులు పెట్టించిన ఘనత పెద్దారెడ్డికే దక్కిందన్నారు. ఇలాంటి వ్యక్తికి మద్ధతుగా నిలిచి జిల్లా వైసీపీ నేతలు ఎస్పీ జగదీష్‌ను కలిసి తాడిపత్రికి రానివ్వడం లేదంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పట్లో టీడీపీ నేతలపై అక్రమకేసులు పెట్టడం మరిచిపోయారా అంటూ మండిపడ్డారు. న్యాయం ఎటువైపు ఉంటే అక్కడ జిల్లా వైసీపీ నేతలు ఉండాలని తెలిపారు. లేకపోతే ఈనెల 29న పెద్దారెడ్డికి మద్ధతుగా నిలిచిన నాయకుల ఇళ్లవద్ద మౌనదీక్ష చేస్తామని హెచ్చరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Aug 24 , 2024 | 07:51 AM