Share News

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం : ఎస్పీ

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:25 AM

పుట్టపర్తి రూరల్‌, మార్చి 10: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు, ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు గా ను జిల్లాలో సాయిధ బలగాల చేత కవాతు నిర్వహిస్తున్నామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.

 ప్రశాంత ఎన్నికలే లక్ష్యం : ఎస్పీ

పుట్టపర్తి రూరల్‌, మార్చి 10: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు, ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు గా ను జిల్లాలో సాయిధ బలగాల చేత కవాతు నిర్వహిస్తున్నామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత మూడురోజులుగా హిందూపురం, ధర్మవరం, కొత్తచెరువులో బీఎ్‌సఎఫ్‌, సీఐఎ్‌సఎఫ్‌ సాయిధ బలగాల చేత కవా తు నిర్వహించామన్నారు. ఆదివారం రామగిరిలో నిర్వహించామన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటుహక్కు ను ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ఇందుకు పోలీసు సాయిధ బలగాల భద్రత, భరోసా ఉంటుందని తెలియజేసేందుకు ఈకవాతును నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాప్రజలు సైతం భద్రతా దళాలకు సహకరించాలని కోరారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని, ప్రతిఒక్కరూ నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.

Updated Date - Mar 11 , 2024 | 07:08 AM