Share News

bjp,tdp: ప్రశాంత వాతావరణం నెలకొల్పుతా: సత్యకుమార్‌

ABN , Publish Date - Apr 23 , 2024 | 01:06 AM

ఎన్నికల్లో తాను గెలిస్తే అస్తవ్యస్తంగా ఉన్న ధర్మవరం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతానని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఆయనకు మద్దతుగా సోమవారం సామాజిక వేత్త గడ్డం రాజగోపాల్‌ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సత్యకుమార్‌యాదవ్‌ పాల్గొని మాట్లాడారు. ధర్మవరంలో శాంతిని కోరుకునేవారు కూటమిని గెలిపించాలన్నారు.

bjp,tdp:  ప్రశాంత వాతావరణం నెలకొల్పుతా: సత్యకుమార్‌

ధర్మవరం, ఏప్రిల్‌ 22: ఎన్నికల్లో తాను గెలిస్తే అస్తవ్యస్తంగా ఉన్న ధర్మవరం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతానని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఆయనకు మద్దతుగా సోమవారం సామాజిక వేత్త గడ్డం రాజగోపాల్‌ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సత్యకుమార్‌యాదవ్‌ పాల్గొని మాట్లాడారు. ధర్మవరంలో శాంతిని కోరుకునేవారు కూటమిని గెలిపించాలన్నారు.


తాము గెలిస్తే నియోజకర్గానికి అరాచకపాలన నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా చేస్తామన్నారు. గ్రామాలలో అన్ని సమస్యల్ని తీర్చుతామన్నారు. ప్రధాన వీధుల్లో ర్యాలీ ని కొనసాగించారు. అన్నిసంఘాల వారు ర్యాలీకి మద్దతు పలికారు. కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...


Updated Date - Apr 23 , 2024 | 01:06 AM