వేతన బకాయిలు ఇవ్వండి
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:08 AM
బకాయి వేతనాలు ఇవ్వాలని సీపీడబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. ఆరునెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలన్నారు. గుఉవారం ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

విడపనకల్లు, జూన 6: బకాయి వేతనాలు ఇవ్వాలని సీపీడబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. ఆరునెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలన్నారు. గుఉవారం ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ వేధిస్తున్నాడన్నారు. ఫిబ్రవరిలో నిరసన తెలుపగా నాలుగు నెలల వేతనాలు ఇచ్చారని, తరువాత ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. వేతనాల విషయం అటు కాంట్రాక్టర్‌గాని ఇటు అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదని చెబుతున్నారన్నారు. ఇలా చేస్తే కుటుంబాలను ఎలా పోషంచుకోవాలని ప్రశ్నించారు. పీఎఫ్ మంజూరు చేయాలని, వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. తమకు వేతనాలు అందే వరకు తాగునీటిని సరఫరా కానీయమని వివరించారు. కాంట్రాక్టు కార్మికులు నిరసన వ్యక్తం చేయడంతో తొమ్మిది గ్రామాలకు నీటి సరఫరా బంద్ అయ్యింది. ఈ కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు పాల్గొన్నారు.