TDP : మంత్రి సవితకు పరిటాల సునీత సత్కారం
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:09 AM
బీసీ సం క్షేమం, చైనేత, జౌళి శా ఖ మంత్రి సవితను మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరి టాల సునీత కలిశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అ తిథిగృహంలో బుధ వారం రాప్తాడు నాయ కులతో కలిసి బొకే అందించి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పరిటాల సునీతను శాలువాతో సత్కరించారు. పరిటాల సునీత మాట్లాడుతూ.. బీసీలకు టీడీపీతోనే న్యాయం జరుగుతుందని మరోసారి నిరూపితమైందన్నారు.

పెనుకొండ టౌన, జూన 26 : బీసీ సం క్షేమం, చైనేత, జౌళి శా ఖ మంత్రి సవితను మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరి టాల సునీత కలిశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అ తిథిగృహంలో బుధ వారం రాప్తాడు నాయ కులతో కలిసి బొకే అందించి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పరిటాల సునీతను శాలువాతో సత్కరించారు. పరిటాల సునీత మాట్లాడుతూ.. బీసీలకు టీడీపీతోనే న్యాయం జరుగుతుందని మరోసారి నిరూపితమైందన్నారు. సవిత రాజకీయాల్లో ఎంతో కష్టపడి పైకి వచ్చారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెకు సముచిత స్థానం కల్పించారన్నారు. మంత్రి సవిత బీసీలకు, చేనేతలకు న్యాయం జరిగేలా ఖచ్చితంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో టీడీపీ నాయకులు మాధవనాయుడు, సర్పంచ శ్రీనివాసులు, మావటూరు గోపాల్, నీరుగంటి చంద్ర, త్రివేంద్ర, బాబుల్‌రెడ్డి, అరుణ్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, దాదు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....