Share News

ఫ్యాక్షనను రూపుమాపిన పరిటాల రవీంద్ర

ABN , Publish Date - Jan 24 , 2024 | 11:47 PM

ఉమ్మడి అనంత జిల్లాలో ఫ్యాక్షనను రూపుమాపిన నేత పరిటాల రవీంద్ర అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత అన్నారు.

ఫ్యాక్షనను రూపుమాపిన పరిటాల రవీంద్ర
పెనుకొండలో పరిటాల చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న సవిత, నాయకులు

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత

పెనుకొండ టౌన, జనవరి 24: ఉమ్మడి అనంత జిల్లాలో ఫ్యాక్షనను రూపుమాపిన నేత పరిటాల రవీంద్ర అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత అన్నారు. బుధవారం పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలను పట్టణంలో నిర్వహించారు. తొలుత స్థానిక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. పట్టణంలో ర్యాలీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రామగిరిలోని పరిటాల ఘాట్‌వద్ద పెద్దఎత్తున టీడీపీ శ్రేణులతో కలిసి సమాధికి పూలమాలలువేశారు. సవిత మాట్లాడుతూ.. పెనుకొండ నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు పరిటాల రవీంద్ర అన్నారు.

రొద్దం: స్థానిక టీడీపీ కార్యాలయంలో పరిటాల వర్ధంతిని బుధవారం ఆ పార్టీ నాయకులు వివరించారు. పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. పెనుకొండ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను నాయకులు కొనియాడారు. హిందూపురం పార్లమెంట్‌ అధికారప్రతినిధి నరసింహులు, కన్వీనర్‌ నరహరి, రామాంజనేయులు, పెద్దమంతూరు రాము, నారాయణ, పవన పాల్గొన్నారు.

పెనుకొండ: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతిని స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మునిమడుగు వెంకటరాముడు, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశవయ్య, శశిభూషణ్‌, సాయికళ్యాణ్‌ ఆధ్వర్యంలో పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. రాంపురం సర్పంచ శ్రీనివాసులు, కన్వీనర్‌ సిద్దయ్య, కన్నాస్వామి, తోటగేరి శీనా, హూజురుల్లాఖాన, జావిద్‌, బోయ గాయిత్రి, షౌకత, గుట్టూరు నాగరాజు, ఆదిశేషు, వరప్రసాద్‌, రబ్బాని, రియాజ్‌, పోతిరెడ్డి, ప్రభంజనకుమార్‌, వడ్డినాగప్ప, విజయ్‌కుమార్‌, దోణి లక్ష్మీనారాయణ, చంద్రమౌళి, షీప్‌ఫాం చంద్ర, శ్రీనివాసులు, నంజుండ, షమున, సానిపల్లి వెంకటేశ, శెట్టిపల్లి వెంకటేశ, నజీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2024 | 11:47 PM