Share News

వైద్యుల కోసం పడిగాపులు..!

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:09 AM

పట్టణంలోని ప్రభుత్వా సుపత్రి అంటేనే నిర్లక్ష్యానికి నిదర్శనం అన్న విధంగా తయారైందని ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆవేదన చెం దుతున్నారు.

వైద్యుల కోసం పడిగాపులు..!
దంత వైద్య చికిత్సాలయం వద్ద వైద్యుడి కోసం వేచి ఉన్న రోగులు

పురం దంత వైద్య చికిత్సాలయం వద్ద రోగుల నిరీక్షణ

హిందూపురం అర్బన, ఏప్రిల్‌ 11: పట్టణంలోని ప్రభుత్వా సుపత్రి అంటేనే నిర్లక్ష్యానికి నిదర్శనం అన్న విధంగా తయారైందని ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆవేదన చెం దుతున్నారు. ఉద యమే ఆసుపత్రికి వచ్చినా సమయానికి వైద్యులు రాకపోవడం తో నిరీక్షించి నీరసించి పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. వైద్యులు వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. ఎవరిని అడగాలో తెలియదన్నారు. వైద్యుడు వస్తాడని ఎదురు చూస్తున్నామని పేర్కొ న్నారు. హిందూపురం దంత వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలోని దంత చికిత్సాలయానికి గురువారం ఉదయం కొంత మం ది వచ్చారు. అయితే ఉదయం 11 గంటలైనా వైద్యులెవరూ రాలేదు. దీంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పరిగి మండలం శ్రీరంగరాజుపల్లికి చెందిన రాములమ్మకు దంతాలు ఊగుతున్నాయి. కొద్దిరోజుల కిందట ఆమె ఆసుపత్రికి వస్తే వైద్య పరీక్షలు చేసి గురువారం రమ్మన్నారు. తీరా ఇక్కడికి వస్తే వైద్యులు లేరు. అదే విధంగా హిందూపురం ధర్మపురం ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అనే వ్యక్తికి దవడలు వాచిపోయాయి. పండుగపూట నమాజ్‌ చదువుకుని నేరుగా ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. ఎంత సేపు వేచిచూసినా వైద్యుడు రాలేదు. శ్రీకంఠపురానికి చెందిన మంజునాథ్‌ పంటి నొప్పితో చాలా బాధ పడుతున్నాడు. వైద్యులు వచ్చి ఏదైనా చికిత్సలు చేస్తారని, తన బాధను తగ్గిస్తారని ఎదురు చూస్తున్నాడు. అయితే బాధితులను పట్టించుకునే వారే లేరు. అయినా వారు మధ్యాహ్నం వరకు అక్కడే నిరీక్షస్తూ కూర్చుండి పోయారు.

కూలి పని వదులుకుని వచ్చా.. - రాములమ్మ, శ్రీరంగరాజుపల్లి

కొంత కాలంగా పండ్లు ఊగుతున్నాయి. ఇంతకు ముందు వచ్చా. పరీక్షించి గురువారం రమ్మన్నారు. ఆర్యోగం ముఖ్యమని కూలి పని కూడా వదులుకుని వచ్చా. తీర ఇక్కడకు వస్తే వైద్యుడు లేరు.

ఇలా అయితే ఎలా?- మహ్మద్‌, ధర్మపురం, హిందూపురం

నాకు పంటి సమస్యతో దవడ మొత్తం వాచింది. నొప్పి భరించలేకున్నాను. ఉదయం నమాజు చదువుకుని నేరుగా ఆసుపత్రికి వచ్చా. ఉదయం 11 గంటలైనా వైద్యులు రాలేదు. ఇంత నిర్లక్ష్యమైతే ఎలా.

Updated Date - Apr 12 , 2024 | 12:09 AM