Share News

సేంద్రియ సేద్యమే సేఫ్‌

ABN , Publish Date - May 24 , 2024 | 11:55 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతలో కూడా మార్పు వస్తోంది. భూసారం.. ప్రజా ఆరోగ్యం రక్షించుకోవడానికి.. పంట పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడానికి వారు సేంద్రియ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. అన్నదాతను ఆర్థికంగా గట్టెక్కించాలని వ్యవసాయాశాఖాధికారులు తగు సూచనలు సలహాలు ఇస్తూ సేంద్రియ ఎరువులను వాడాలని ప్రోత్సహిస్తున్నారు.

సేంద్రియ సేద్యమే సేఫ్‌
farmers are changing

సంప్రదాయ పద్ధతుల్లోనే పంటల సాగు

రసాయనిక సేద్యానికి స్వస్తి

కళ్యాణదుర్గం : మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతలో కూడా మార్పు వస్తోంది. భూసారం.. ప్రజా ఆరోగ్యం రక్షించుకోవడానికి.. పంట పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడానికి వారు సేంద్రియ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. అన్నదాతను ఆర్థికంగా గట్టెక్కించాలని వ్యవసాయాశాఖాధికారులు తగు సూచనలు సలహాలు ఇస్తూ సేంద్రియ ఎరువులను వాడాలని ప్రోత్సహిస్తున్నారు. రైతులు సేంద్రియ ఎరువులను వాడేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. దీంతో సేంద్రియ ఎరువులకు ఇటీవల డిమాండ్‌ పెరుగుతోంది. ఈ ఖరీఫ్‌ సీజనలో ఎక్కువగా సేంద్రియ ఎరువులను ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. పశువుల పేడ కుంటలు, మేక, గొర్రెల పేడలు పొలాలకు తోలుతున్నారు. పశువుల పేడలేని రైతులు పాడి ఎరువులను కొనుగోలు చేస్తున్నారు.


రెండు వేల హెక్టార్లకు పైబడి సాగు

ఖరీఫ్‌ కింద ఏటా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రెండు వేల హెక్టార్లకు పైబడి వేరుశెనగ పంటను సాగు చేస్తారు. వేరుశెనగ పంటతో పాటు అంతర పంటలు సాగుకు కూడా రైతులు సిద్దమవుతున్నారు. ఇప్పుడు ఏ పంట సాగు చేయాలన్నా... మొదట సేంద్రియ ఎరువులను ఉపయోగించాలన్న ఆలోచనలో రైతులు ఉన్నారు. దీంతో పాటు కర్భూజా, కళింగర, టమోటా పంటలకు కూడా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తున్నారు. సేంద్రియ ఎరువులు వాడడం వలన వ్యవసాయ ఖర్చులు తగ్గడమే కాకుండా పంట దిగుబడులకు మంచి అవకాశాలు ఉంటుందనే ఆలోచనలో రైతులు ఉన్నారు. రైతులు కొనుగోలు చేసిన సేంద్రియ ఎరువును ఎండ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా పొలాలకు తోలుకునే పనిలో నిమగ్నమయ్యారు.


రసాయనిక ఎరువుల తో పెరిగిన పెట్టుబడి

రసాయనిక ఎరువుల ధరలు రోజురోజుకు అమాంతంగా పెంచేస్తున్నారు. దీంతో రైతులు రసాయనిక ఎరువులకు అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడి ఖర్చు కూడా రానురాను పెరిగిపోతోంది. రసాయనిక ఎరువులు వాడకం వల్ల చీడపీడలు సోకి పంట దిగుబడి తగ్గిపోతోంది. ఈ విషయాన్ని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తెలియచేయడంతో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి.. సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులు మొగ్గుచూపుతున్నారు.

Updated Date - May 24 , 2024 | 11:55 PM