Share News

కోడ్‌ ఉల్లంఘనలపై కలెక్టర్‌ కొరడా

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:53 PM

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై జిల్లా కలెక్టరు కొరఢా ఝలిపిస్తున్నారు.

కోడ్‌ ఉల్లంఘనలపై   కలెక్టర్‌ కొరడా

ఫ 36 మంది వలంటీర్లపై వేటు

ఫ ఇతరశాఖలకు చెందిన మరో 16మందిపైనా..

అనంతపురం టౌన, మార్చి 26: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై జిల్లా కలెక్టరు కొరఢా ఝలిపిస్తున్నారు. మొదట్లో కొంత చూసీచూడనట్లు అధికారుల వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతూ వచ్చాయి. దీనిపై ఆంద్రజ్యోతిలోనూ ప్రత్యేక కథనాలు ప్రచురించ డం జరిగింది. అప్పటినుచి కలెక్టరు గౌతమి కోడ్‌ ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాజకీయ పార్టీల కార్యక్రమాలు. ప్రచారాల్లో పాల్గొంటున్న వలంటీర్లు. డీలర్లు, సచివాలయ సిబ్బంది. ఐకేసీ సిబ్బందిపై చర్యలు చేపడుతూ వస్తున్నారు. ఇందు కు సంమందించి మంగళవారం కలెక్టరు వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 36మంది వలంటీర్లపై చర్యలు తీసుకున్నట్లు కలెక్టరు తెలిపారు. మంగళవారం కూడా గుంతకల్‌ నియోజకవర్గంలో ఆరుగురు వలంటీర్లు. రాయదుర్గం నియోజకవర్గంలో 9మంది వలంటీర్లపై చర్యలు వేటు వేసినట్లు ఆమె వెల్లడించారు. వీరితో పాటు ఇతరశాఖలకు చెందిన మరో 16 మందిపైనా చర్యలు తీసుకున్నామనీ, ఇందులో డీలర్లు ఐదుగురు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఏడుగురు, రెగ్యులర్‌ ఉద్యోగి ఒకరిపై చర్యలు తీసుకున్నట్లు కలెక్టరు తెలిపారు. ఇందులో కూడా మంగళవారం ముగ్గురు కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై వేటు వేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్న 7,025 పోస్టర్లు, 3,312 బ్యానర్లు, 812 గోడలపై రాతలు తొలగించామన్నారు. ఇప్పటివరకు సీవిజిల్‌ యాప్‌ద్వారా 191 ఫిర్యాదులు వచ్చాయనీ, పరిశీలించి చర్యలు తీసుకున్నామని కలెక్టరు గౌతమి తెలిపారు.

Updated Date - Mar 26 , 2024 | 11:53 PM