వినతిపత్రం సమర్పణతో సరి..
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:55 PM
విద్యుత చార్జీల పెంపును వ్యకిరేకిస్తూ వైసీపీ చేపట్టి పోరుబాట నిరసన ధర్నా జిల్లాలో చప్పగా సాగింది. జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత చార్జీల పెంపుదలపై విద్యుత శాఖ కార్యాలయాలవద్ద శుక్రవారం వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు.

పుట్టపర్తి, డిసెంబరు27(ఆంధ్రజ్యోతి): విద్యుత చార్జీల పెంపును వ్యకిరేకిస్తూ వైసీపీ చేపట్టి పోరుబాట నిరసన ధర్నా జిల్లాలో చప్పగా సాగింది. జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత చార్జీల పెంపుదలపై విద్యుత శాఖ కార్యాలయాలవద్ద శుక్రవారం వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంటకరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ధర్నా చేశారు. పుట్టపర్తిలో వైసీపీ కార్యాలయం నుంచి పక్కనే ఉన్న విద్యుత ఎస్‌ఈ కార్యాలయం వరకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందించారు. పెనుకొండలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ, హిందూపురంలో సమన్వయకర్త దీపిక, కదిరిలో మక్బుల్‌బాషా, మడకశిరలో సమన్వయకర్త ఈరలక్కప్ప, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, నర్సేగౌడ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. ధర్నాకు వచ్చామా.. వినతిప్రతం సమర్పించామా.. అన్న తీరుగా పోరుబాట సాగింది. వైసీపీ అఽధికారంలో ఉన్నపుడు ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో జనంతోపాటు పార్టీ శ్రేణులు హాజరయ్యేవారు. శుక్రవారం నిర్వహించిన పోరుబాటకు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మెన, కౌన్సిలర్లు సర్పంచలు, కొద్దిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఎక్కడా స్వచ్ఛందంగా వచ్చిన దాఖలాలు కనిపించలేదు. రోడ్డుమార్గంలో బెంగళూరుకు వెళ్తున్న మాజీ సీఎం జగనకు స్వాగతం పలికేందుకు పెనుకొండ నియోజక వర్గం సోమందేపల్లిలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ, మాజీ మంత్రి శంకరనారాయణ వర్గీయులు వెళ్లారు. అక్కడ పోటాపోటీ నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.