Share News

ఎనఎస్‌యూఐ నేత హత్య

ABN , Publish Date - May 30 , 2024 | 11:54 PM

హిందూపురం పట్టణానికి చెందిన యువ న్యాయవాది, ఎనఎ్‌సయూఐ జాతీయ కార్యదర్శి సంపత కుమార్‌(31) దారుణ హత్యకు గురయ్యారు. ధర్మవరం చెరువు రెండో మరువ వద్ద అతడి మృతదేహాన్ని పడేశారు.

ఎనఎస్‌యూఐ నేత హత్య

ఫ గతంలోనూ గొడవలు.. పోలీసు కేసులు

ఫ ప్రాణహాని ఉందని పోలీసులకు సమాచారం..

ధర్మవరం చెరువు రెండో తూము సమీపంలో మృతదేహంధర్మవరం, మే 30:

హిందూపురం పట్టణానికి చెందిన యువ న్యాయవాది, ఎనఎ్‌సయూఐ జాతీయ కార్యదర్శి సంపత కుమార్‌(31) దారుణ హత్యకు గురయ్యారు. ధర్మవరం చెరువు రెండో మరువ వద్ద అతడి మృతదేహాన్ని పడేశారు. ఈ హత్య బుధవారం రాత్రి జరిగినట్లు భావిస్తున్నారు. స్థల వివాదమే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూపురంలో సీనియర్‌ న్యాయవాది కృష్ణారెడ్డితో సంపత కుమార్‌కు స్థల వివాదం ఉంది. సంపత కుమార్‌ స్నేహితుడు శ్రీకాంతరెడ్డికి చెందిన స్థలం తనదని న్యాయవాది కృష్ణారెడ్డి అంటుండటంతో సంపత కుమార్‌ జోక్యం చేసుకున్నారు. రూ.కోట్లు విలువ చేసే ఆ స్థలం కోసం సంపత కుమార్‌ పెట్టుబడి కూడా పెట్టినట్లు తెలుస్తోంది. స్థలం విషయంలో కృష్ణారెడ్డి, సంపత కుమార్‌ పలుమార్లు గొడవ పడి కేసులు కూడా పెట్టుకున్నారు. కృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని సంపత కుమార్‌ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేరళ నుంచి వచ్చాక..

ఫ ఎనఎ్‌సయూఐ జాతీయ కార్యదర్శిగా ఉన్న సంపతకుమార్‌ను ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆయనను కేరళకు పంపించింది. అక్కడ పనులు ముగించుకుని, నాలుగురోజుల క్రితం హిందూపురానికి తిరిగి వచ్చాడు. పట్టణంలోని కోర్డు ఎదురుగా ఉన్న పానషాపులో బుధవారం రాత్రి రెండు పానబీడాలు తీసుకున్నాడు. ఆ తరువాత తన అక్క భాగ్యలక్ష్మికి ఫోనచేశాడు. స్నేహితులు వచ్చారని, మళ్లీ మాట్లాడుతానని పెట్టేశాడు. అక్కడి నుంచి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు సంపత కుమార్‌ను కారులో తీసుకువెళ్లి.. మార్గం మధ్యలో హత్య చేసినట్లు సమాచారం. మృతదేహాన్ని గురువారం తెల్లవారుజామున ధర్మవరం పట్టణం నుంచి ఏలుకుంట్లకు వెళ్లే దారిపక్కన.. చెరువు రెండో మరువ వద్ద కంపచెట్లలో పడేసి వెళ్లిపోయారు. అటువైపు ఉదయం వెళ్లినవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.


ఫ విషయం తెలుసుకున్న ధర్మవరం వనటౌన సీఐ సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుడి ప్యాంట్‌ జేబులో ఉన్న పానబీడాలు, షర్ట్‌ కాలర్‌ మీద లేబుల్‌ ఆధారంగా ఆనవాళ్లు గుర్తించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. సంపత కుమార్‌ తండ్రి రాజశేఖర్‌, సోదరి భాగ్యలక్ష్మి అక్కడికి చేరుకుని.. సంపతకుమార్‌ మృతదేహం వద్ద బోరున విలపించారు. సీనియర్‌ న్యాయవాది కృష్ణారెడ్డి, అతని కుమారుడు నాగార్జున, వారి అనుచరులపై అనుమానం ఉందని సంపత కుమార్‌ తండ్రి తెలిపారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హంతకులు ఉపయోగించిన కారును అనంతపురంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఫ సంపతకుమార్‌ హత్య గురించి తెలుసుకున్న మాజీ మంత్రి శైలజానాథ్‌ ధర్మవరం చేరుకున్నారు. పార్టీ ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థి రంగన అశ్వత్థనారాయణతో కలిసి మృతదేహాన్ని సందర్శించారు. హత్యకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి, కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరారు.

Updated Date - May 30 , 2024 | 11:54 PM