Share News

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:20 PM

అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘ ట్టం గురువారంతో ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేశా రు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి 21 మంది అభ్యర్థులు 34 నా మినేషన్ల పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌ కుమార్‌ తెలిపారు.

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
Nandamuri Vasundhara Devi presenting the nomination papers

పురం బరిలో 21 మంది అభ్యర్థులు పోటీ

34 నామినేషన్ల పత్రాలు దాఖలు

హిందూపురం, ఏప్రిల్‌ 25: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘ ట్టం గురువారంతో ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేశా రు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి 21 మంది అభ్యర్థులు 34 నా మినేషన్ల పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌ కుమార్‌ తెలిపారు. టీడీపీ తరపున నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి నందమూరి వసుంధర దేవి, వైసీపీ తరుపున దీపిక, ఆమె భర్త వేణురెడ్డి, వెంకటేశరెడ్డి, కాంగ్రెస్‌ తర పున ఇనయతుల్లా, అసీనాబాను నామినేషన వేశారు. అలాగే బీఎస్పీ తరపున శ్రీరాములు, సోషలిస్ట్‌ యూనిటి సెంటర్‌ ఆఫ్‌ ఇండియా పార్టీ తరపున రవీంద్ర, ఆంధ్ర ప్రదేశ రాష్ట్ర సమితి తరపున కోడు మూరు నౌషద్‌, జయ్‌భీం రావ్‌ భారత పార్టీ తరపున నాగరాజు, ఇండియన ప్రజా కాంగ్రెస్‌ పార్టీ తరపున పార్వతి, సమాజ్‌వాది పార్టీ తరపున షేక్‌ షౌహద్‌, మరో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే వైసీపీ తరపున నామినేషన వేసిన వెంటకేశరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా కూడా మరో నామినేషన దాఖలు చేశారు. ఆఖరి రోజు గురువారం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఇనయ తుల్లా, టీడీపీ తరపున నందమూరి వసుంధర దేవి నామినేషన్లు దాఖలు చేశారు.


పెనుకొండ అసెంబ్లీ స్థానానికి 25...

పెనుకొండ: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెనుకొండ ని యోజకవర్గ అసెంబ్లీ స్థానానికి నామినేషన గడువు ముగిసే సమ యానికి మొత్తం 25నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపా రు. ఆఖరి రోజైన గురువారం మంత్రి, వైసీపీ అభ్యర్థి ఉశశ్రీచరణ్‌, అట్టహాసంగా నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్‌ అధికారి అపూర్వ భరతకు అందజేశారు. అనంతరం టీడీపీ అభ్యర్థి సవిత తరుపున ఒక నామినేషన, టీడీపీకి మద్దతుగా కురుబ రవికుమార్‌ మరో నా మినేషన దాఖలు చేశారు. బీఎస్పీ అభ్యర్థి ఆదినారాయణ, జైభీమ్‌ పార్టీ నాగరాజు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నరసింహప్ప, స్వతంత్య్ర అభ్యర్థులు గణేష్‌నాయక్‌, హబీబ్‌, నరేంద్ర, నరసింహులు, నామినేషన వేశారు. నామినేషన్ల గడువు ముగిసేనాటికి టీడీపీ నాలుగు, వైసీపీ రెండు, బీఎస్పీ నాలుగు, జైభీమ్‌ ఒకటి, కాంగ్రెస్‌ పార్టీ మూడు, స్వతంత్ర అభ్యర్థులు 11నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అపూర్వభరత తెలిపారు.


మడకశిరలో 35...

ఆఖరి రోజు 13 నామినామినేషనల దాఖలు

మడకశిర : మడకశిర నియోజకవర్గంలో ఆఖరి రోజు గురువా రం 13 మంది నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో మొత్తం 35 నామినేషన్లు దాఖలు అయ్యా యి. ఇందులో బాగంగా టీడీపీకి చెందిన ఎంఎస్‌.రాజు నాలుగు సెట్లు, వైసీపీ తరుపున ఈరలక్కప్ప నాలుగుసెట్లు, కాంగ్రెస్‌ పార్టీ తరుపున కె.సుధాకర్‌ రెండు సెట్లు వేశారు. స్వతంత్ర అభ్యర్థి గా సునీల్‌ కుమార్‌ 3 సెట్లు, రాడికల్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పరదేశన్న గారి హనుమంతరాజు రెండు సెట్లు , బహుజన సమాజ్‌ పార్టీ తరుపున ఇందివర్‌, టీడీపీ తరుపున నరస్పగారి మంజునాథ్‌ నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు 15 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 11:20 PM