Share News

స్పిరిట్‌ ఫ్యాక్టరీ వద్దు

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:41 AM

మండలంలోని రేకలకుంట గ్రామం వద్ద స్పిరిట్‌ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని ఆ గ్రామ రైతులు ఫ్యాక్టరీ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు.

స్పిరిట్‌  ఫ్యాక్టరీ వద్దు
ఆందోళన చేస్తున్న రైతులు

బుక్కరాయసముద్రం, మార్చి 25: మండలంలోని రేకలకుంట గ్రామం వద్ద స్పిరిట్‌ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని ఆ గ్రామ రైతులు ఫ్యాక్టరీ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. కొన్ని సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకూడదని ఆ గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ అనుమతులు ఇవ్వరాదని 2013 నుంచి ఫ్యాక్టరీ యాజమాని జేసీ రవీంద్రా రెడ్డికు ఆ గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు మధ్య వివాదం నడుస్తోంది. రైతులు 2017లో కోర్టును ఆశ్రయించి ఫ్యాక్టరీ నిర్మాణపు పనులు నిలుపుదల చేయాలని స్టే తెచ్చారు. కాగా, ఆ నిర్మాణపు పనులు ప్రారంభించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం సోమవారం సిద్ధమయ్యారు. దీంతో రేకలకుంట గ్రామ ప్రజలు, రైతులు ఒక్కసారిగా ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. కోర్టులో స్టే ఉండగా న్యాయస్థానం ఉత్తర్వులు ఉల్లఘించి నిర్మాణపు పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే నిర్మాణపు పనులు ఆపకపోతే... ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్‌ను రెండు రోజుల్లో కలిసి సమస్యపై వినతి పత్రం ఇస్తామన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:41 AM