Share News

ఎటు చూసినా గుంతలే..!

ABN , Publish Date - May 20 , 2024 | 11:59 PM

మండలంలోని మరూరు ఆంజనేయస్వామి దేవాల యం వద్ద నుంచి ధర్మవరం ప్రధాన రహదారి వరకూ ఉన్న 12 కిలో మీటర్ల తారు రోడ్డు గుంతల మయంగా ఉంది.

ఎటు చూసినా గుంతలే..!
మరూరు నుంచి ధర్మవరం వెళ్లే దారిలో ఏర్పడ్డ భారీ గుంత

రాప్తాడు, మే 20: మండలంలోని మరూరు ఆంజనేయస్వామి దేవాల యం వద్ద నుంచి ధర్మవరం ప్రధాన రహదారి వరకూ ఉన్న 12 కిలో మీటర్ల తారు రోడ్డు గుంతల మయంగా ఉంది. దారి పొడవునా ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడ్డా యి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాప్తాడు మండలంలోని అనేక గ్రామాల నుంచి ధర్మవరానికి ఈ రోడ్డు మార్గం ద్వారానే వాహనదారులు ఎక్కువగా వెళ్తుంటారు. గుంతలు ఎక్కువగా ఉండటంతో వాహన దారులు ప్రమాదాల పడుతున్నారు. ఈ తారు రోడ్డుకు ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మత్తులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - May 20 , 2024 | 11:59 PM