పనుల కల్పనలో నిర్లక్ష్యం తగదు
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:15 AM
ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం తగదని ఆ పథకం పీడీ సలీంబాషా తెలిపారు. పట్టణ సమీపంలోని డ్వామా కార్యాలయంలో గురువారం ఆయన ఐదు మండలాల ఉపాధి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.

రాయదుర్గంరూరల్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం తగదని ఆ పథకం పీడీ సలీంబాషా తెలిపారు. పట్టణ సమీపంలోని డ్వామా కార్యాలయంలో గురువారం ఆయన ఐదు మండలాల ఉపాధి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న పనులను పూర్తి చేయాలన్నారు. ఫారంపాండ్లు, గోకులం షెడ్ల ఏర్పాట్లు, నీటి కుంటలు, పల్లె వనాల పనులలో పురోగతిని పెంచాలని తెలిపారు. కూలీలందరికీ వందరోజుల పనులు కల్పించే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఏపీడీ అయేషా, ఐదు మండలాల ఏపీఓలు, ఈసీలు, ప్లాంటేషన సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..