రోడ్ల విస్తరణపై నిర్లక్ష్యం
ABN , Publish Date - May 12 , 2024 | 12:46 AM
నగరంలోని శ్రీకంఠం సర్కిల్ నుంచి పాతూరుకు వెళ్లే తిలక్ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. రోడ్డు విస్తరణ చేయా ల్సిన ఉన్నా.. వైసీపీ పాలకులు ఏ నాడు దాని గురించి పట్టించు కోలేదు.

అనంతపురం సిటీ : నగరంలోని శ్రీకంఠం సర్కిల్ నుంచి పాతూరుకు వెళ్లే తిలక్ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. రోడ్డు విస్తరణ చేయా ల్సిన ఉన్నా.. వైసీపీ పాలకులు ఏ నాడు దాని గురించి పట్టించు కోలేదు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ మరీ ఎక్కువగా ఉండ టంతో వాహన దారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు చిన్నదిగా ఉండటంతో పాటు.. రోడ్లకు ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.