ఆర్టీసీ బస్టాండ్ కిటకిట
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:23 AM
ప్రయాణికుల రద్దీతో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది.
అనంతపురం కల్చరల్, మార్చి 7: ప్రయాణికుల రద్దీతో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం, రెండో శనివారం, ఆదివారాలు వరుస సెలవులు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు తమ కుటుంబంతో కలిసి శుక్రవారమే సొంతూళ్ల బాట పట్టారు. కాగా కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్లేలా అనంతపురం రీజియన నుంచి 55 బస్సులను కేటాయించడంతో పలు రూట్లకు బస్సు సర్వీసులు రద్దయ్యాయి. ఈ కారణంగా ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. బస్సులు బస్టాండులోకి ప్రవేశించగానే సీట్ల కోసం పోటీపడ్డారు. బస్సుల్లో సీట్లు లేకపోయినా ప్రయాణికులు నిలబడే తమ ప్రయాణాలను సాగించారు.