Share News

tdp: కూటమితోనే రాషా్ట్రభివృద్ధి: కందికుంట

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:27 AM

గాండ్లపెంట, ఏప్రిల్‌ 29: కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలోని గొడ్డివెలగల పంచాయతీ దాసరవాండ్లల్లి, గేదర్ల, పాలంవాండ్లపల్లి, నీరుకుంట్లపల్లి, ఎర్రగోగులపల్లి, వంకలోపల్లి, తుమ్మలబైలు పెద్దతండా, సాదులవాండ్లపల్లి, తుమ్మలబైలు, కోటినేపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. అలాగే తూపల్లి పంచాయతీలోని వంకపల్లి, కటకంవారిపల్లి, పోరెడ్డిపల్లి గ్రామాల్లో నూ ప్రచారం చేపట్టారు. ప్రతి గ్రామంలోనూ గ్రామస్థులు, స్థానిక నాయకులు పూల వర్షం కురిపిస్తూ, బాణసంచా కాల్చుతూ ఘన స్వాగతం పలికారు.

tdp:  కూటమితోనే రాషా్ట్రభివృద్ధి: కందికుంట
నీరుకుంట్లపల్లి కందికుంటకు హారతి పడుతున్న మహిళలు

గాండ్లపెంట, ఏప్రిల్‌ 29: కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలోని గొడ్డివెలగల పంచాయతీ దాసరవాండ్లల్లి, గేదర్ల, పాలంవాండ్లపల్లి, నీరుకుంట్లపల్లి, ఎర్రగోగులపల్లి, వంకలోపల్లి, తుమ్మలబైలు పెద్దతండా, సాదులవాండ్లపల్లి, తుమ్మలబైలు, కోటినేపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. అలాగే తూపల్లి పంచాయతీలోని వంకపల్లి, కటకంవారిపల్లి, పోరెడ్డిపల్లి గ్రామాల్లో నూ ప్రచారం చేపట్టారు. ప్రతి గ్రామంలోనూ గ్రామస్థులు, స్థానిక నాయకులు పూల వర్షం కురిపిస్తూ, బాణసంచా కాల్చుతూ ఘన స్వాగతం పలికారు.

మహిళలు హారతులు పట్టారు. తర్వాత కందికుంట ఇంటింటా తిరిగి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని, ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బీకే పార్థసారధని గెలిపించాలని ప్రజలను కోరారు. సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించి , చంద్రబాబు సీఎం అవగానే వాటిని అమలు చేస్తారని తెలిపారు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్రం లో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు సజావుగా జరుగుతాయన్నారు. కూటమి గెలుపునకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. సాదులవాండ్లపల్లిలో బోగాదమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పవనకుమార్‌రెడ్డి, మండలకన్వీనర్‌ కొండయ్య, క్లస్టర్‌ ఇనచార్జి ప్రసాద్‌, నాయకులు వెంకటరమణారెడ్డి, కంబయ్య, అక్రమ్‌, పవన, దాదాపీర్‌, ఆనంద్‌, శ్రీరాములనాయక్‌, వీరాంజనేయులు, కేశవరెడ్డి, రంగస్వామిరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 30 , 2024 | 12:27 AM