Share News

నాటి బీమా ధీమా నేడు ఏదీ?: కాలవ

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:03 AM

నిరుపేద కుటుంబాల్లో మరణాలు సంభవించినపుడు చంద్రన్న బీమా ఆర్థిక భరోసా కల్పించిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

నాటి బీమా ధీమా నేడు ఏదీ?: కాలవ

రాయదుర్గం, జనవరి 29: నిరుపేద కుటుంబాల్లో మరణాలు సంభవించినపుడు చంద్రన్న బీమా ఆర్థిక భరోసా కల్పించిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. తన 50 వారాల సెల్ఫీ చాలెంజీలో భాగంగా గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామంలో చంద్రన్న బీమా లబ్ధిదారులతో 42వ సెల్ఫీ దిగారు. దాన్ని సోమవారం విడుదల చేశారు. టీడీపీ పాలనలో 2014-19 మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో ప్రమాదంలో, సహజంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.242.50 కోట్ల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నట్లు వివరించారు. అబద్ధపు వాగ్దానాలతో గెలిచిన జగనమోహనరెడ్డి చంద్రన్న బీమాను, వైఎస్సార్‌ బీమాగా మార్చాడని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో జిల్లాకు వైఎస్సార్‌ బీమా కింద రూ. 58 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ పాలనలో చంద్రన్న బీమా ద్వారా రూ. 12.60 కోట్లు ఆర్థిక సాయం అందించా మన్నారు. ఇలాంటి పథకాలు కొనసాగాలంటే ఈ రాషా్ట్రనికి టీడీపీ, జనసేన కూటమి చాలా అవసరమని తెలిపారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ సాయం అందక చాలా మంది బాధితులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:03 AM